ఆళ్లగడ్డ పట్టణ కె.వి.సుబ్బారెడ్డి డిగ్రీ కళాశాలనందు కళాశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకుఉమన్ డిగ్నిటీ, సోషల్ మీడియా పై అవగాహన సదస్సులో భాగంగా కాలేజీ నందు ఆళ్ళగడ్డ సబ్ డివిజనల్ శక్తి టీం వారు ఏర్పాటుచేసిన కార్యక్రమంలోఆళ్లగడ్డ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ అయిన డిఎస్పీ బి. వెంకటరామయ్య పాల్గొన్నారు.డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న సుమారు 500 మంది విద్యార్థినీ విద్యార్థులకు డిఎస్పివెంకట్రామయ్య గారు మహిళలపై ప్రస్తుతం జరుగుతున్న లైంగిక దాడులపై, సోషల్ మీడియాలో ప్రస్తుతంజరుగుతున్నదుష్ప్రచారంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూపోక్సో చట్టం మరియు నిర్భయ చట్టాలపై అవగాహన కల్పిస్తూ సైబర్ క్రైమ్,బాల్యవివాహాలు, దిశయాప్, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్,మాదకద్రవ్యాల వంటి అనేక విషయాలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ మంచి ఉన్నతమైన చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించి ప్రజలకు మరియు రాష్ట్రానికి దేశానికి సేవ చేయాలని,పిల్లలపై వారి తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు అడియాశలు కాకుండా సరైన నడవడికతో ఉండిచదువుకోవాలనివిద్యార్థులకుసూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ టౌన్ సిఐ రమేష్ బాబు , ఆళ్ళగడ్డ టౌన్ ఎస్ఐ కేపీబీ వెంకట్ రెడ్డి , కాలేజీ వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి మరియు శక్తి టీం సభ్యులు సుబ్బలక్ష్మి,నాగ శేఖర్, నాగరాజులు పాల్గొన్నారు..
[zombify_post]


