కృష్ణుని జీవితం అందరికీ ఆదర్శం: కోలగట్ల
కృష్ణుని జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని ఏపీ శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఆయన చెప్పిన జీవిత సత్యాలను అందరూ అర్థం చేసుకుంటే జీవితంలో ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కొనే శక్తి వస్తుందని చెప్పారు. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా గురువారం గాజులరేగలోని యాదవవీధి, కొత్తపేట రాధాకృష్ణ కళ్యాణమండపంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్ముని దర్శించుకుని పూజలు జరిపారు.
[zombify_post]


