- డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
ఆడి పాడాల్సిన వయస్సులో ఆ చిన్నారి మంచానికే పరిమితమయ్యాడు.ఇప్పటికే 90 శాతం దెబ్బతిన్న కాలేయంతో నరకయాతన అనుభవిస్తున్నాడు. ముంచుకొస్తున్న మృత్యువు నుంచి తమ బిడ్డను కాపాడుకోవడం ఆ నిరుపేద తల్లిదండ్రులకు తలకుమించిన భారంగా మారింది. దీంతో దాతల సాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ నసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలో ఆలమూరు మండల పరిధిలో గల సూర్యారావుపేట గ్రామానికి చెందిన, టేకుమూడి శ్రీనివాస్, మహాలక్ష్మి,దంపతుల కుమారుడు టేకుమూడి సాయి తేజ (8) ఇటీవల కాలంలో తీవ్ర అనారోగ్యానికి గురవడంతో బాలుడు తల్లిదండ్రులు హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్ లో బాలుడుని చూపించగా వైద్య పరీక్షలో కాలేయం 90% దెబ్బతిందని తక్షణం కాలేయం మార్పిడి చేయాలని వైద్యులు నిర్ధారించారు. వైద్యులు సూచనలు మేరకు తన బిడ్డ ప్రాణాలకు తన ప్రాణం ఫణంగా పెట్టి తన కాలేయంలో సగభాగం తన బిడ్డకు దానం చేయడానికి ఆ తల్లి ముందుకు వచ్చింది. అయితే కాలేయ మార్పిడికి వైద్యులు సుమారు 30 లక్షల ఖర్చు అవుతుందని తెలియజేశారు. అంత డబ్బు తమ వద్ద లేదని ఆ పేద తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి సహాయం అందిస్తే తమ బిడ్డ ప్రాణాలు దక్కుతాయని దాతలను కోరుకున్నారు ఆ నిరుపేద తల్లిదండ్రులు ఎవరైనా సాయం చేసే దాతలు , వారి ఫోన్ పే నెంబర్ 6300721617, వారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ 100010578, ISFC BARBO PEDAPA,ఈ అకౌంట్ ద్వారా సహాయం అందిస్తారని. తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.._..
[zombify_post]
 
					
 
			
			 
			
					
