డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
తనకు రాష్ట్ర బిజిపి అప్పగించిన బాధ్యత ను చిత్త శుద్ధితో నిర్వహిస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజిపి అధ్యక్షులు యాళ్ల దొరబాబు అన్నారు.
అమలాపురం ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ పదా ధికారుల సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కి దొరబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దొరబాబును నాయకులు, కార్యకర్తలు సత్కరించారు.
ఈ సమావేశంలో మాజీ శాసన సభ్యులు అయ్యాజీ వేమా మాట్లాడుతూ పార్టీ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉన్న వారే పార్టీలో ఏదుగుతారని, పార్టీ క్రమశిక్షణ మీరిన వారిని పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదన్నారు. కర్రి చిట్టిబాబు మాట్లాడుతూ ఇప్పటివరకు తనకు ఏ విధమైన సహకారం అందించారో అదే విధంగా దొరబాబు ఇవ్వాలని ఆయన కోరారు.
పార్లమెంటు జిల్లా ఇంచార్జ్ పొట్లూరి రామ్మోహన్ రావు, రాష్ట్ర స్వచ్ఛభారత్ సెల్ కన్వీనర్ పాలూరు సత్యానందం, బిజెపి సీనియర్ నాయకులు ఆర్.వి నాయుడులు యాళ్ల దొరబాబు చే ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శులు మోకా వెంకట సుబ్బారావు, వల్లభనేని రవీంద్రబాబు, ఇళ్ళ వెంకటేశ్వరరావు, బిల్డింగ్ వర్కర్ రాష్ట్ర సెల్ కన్వీనర్ ఆకుల వీరబాబు, జిల్లా ఉపాధ్యక్షులు దూరి రాజేష్, గోనే మడతల రవికుమార్, గ్రంధి నానాజీ, రాష్ట్ర మన్ కి బాత్ కన్వీనర్ చిట్టూరి రాజేశ్వరి, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు చెల్లంగి త్రినాథ్, రాష్ట్ర టీచర్ సెల్ కన్వీనర్ ఇళ్ల సత్యనారాయణ, , సలాది శేఖర్, కే వెంకటేశ్వరరావు, కాళ్లకూరి గోపికృష్ణ, గుమ్మళ్ళ రెడ్డి నాయుడు, గనిశెట్టి వెంకటేశ్వరరావు, జిఎస్ఎన్ గుప్తా, రొక్కల సత్తిబాబు, కొయ్యన సత్య దుర్గ, జే.రాజేంద్రకుమార్, యాండ్రా బులి అబ్బులు, కే హరిబాబు, ఎస్ సత్తిబాబు, జి వెంకట్, వి రమణమూర్తి, వికేఎస్ భాస్కర్ శాస్త్రి, అయ్యల బాషా తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]


