in , , , ,

కాంగ్రెస్ హామీలు బోగస్: మంత్రి జగదీష్ రెడ్డి

  • కాంగ్రెస్ హామీలు బోగస్

  • ప్రజలను మోసగించడం కాంగ్రెస్ కు అలవాటు

  • కాంగ్రెస్ చరిత్ర ఎప్పుడూ ప్రజల వైపు లేదు

  • ఇచ్చిన హామీలు నెరవేర్చిన చరిత్ర కాంగ్రెస్ కు లేదు..ఉండబోదు

  • దేశంలో ఆకలి దారిద్ర్యాలకు కారణం కాంగ్రెస్ పార్టీ

  • అబద్ధాపు హామీలు ఇచ్చే అలవాటు లేని నేత కేసీఆర్

  • అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు ఇచ్చిన హామీలు భఫూన్, బుడ్డర్ ఖాన్ లను తలపించేలా ఉన్నయి..

  • ఒక్కటి అంటే ఒక్కటి కూడా అమలు చేయగలిగినవి లేవు

  • కాంగ్రెస్ వాళ్లు ఏలుతున్న ఏ ఒక్క రాష్ట్రం లో కూడా  నిన్న ప్రకటించిన పథకాలు లేవు

  • అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించాలని చూస్తుంది కాంగ్రెస్

  • చైతన్యవంతులైన తెలంగాణ ప్రజల ముందు కాంగ్రెస్ పాచికలు పారవు

  • కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ కు శ్రీరామ రక్ష

  • రాష్ర్టానికో మ్యానిఫెస్టో తో ప్రజల ను మోసం చేయాలని  చూస్తుంది కాంగ్రెస్

  • హైదరాబాద్‌లో చెప్పిన హామీలు కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా?

  • వారంటీలు లేని గ్యారెంటీలు ఇచ్చి కర్ణాటకను ఆగం చేసింది కాంగ్రెస్

  • సూర్యాపేట:

కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు  అధికారంలోకి వచ్చేది ఉందా.. ఇచ్చేది ఉందా’ అన్న తరహాలో ఉన్నాయని  సూర్యాపేట శాసన సభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. సూర్యాపేట లో మీడియా తో మాట్లాడిన మంత్రి తుక్కు గూడ బహిరంగ సభ లో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలు అన్నీ బోగస్ అన్నారు.ప్రజలను మోసగించడం కాంగ్రెస్ కు అలవాటు అన్న మంత్రి…కాంగ్రెస్ చరిత్ర ఎప్పుడూ ప్రజల వైపు లేదన్నారు.ఇచ్చిన హామీలు నెరవేర్చిన చరిత్ర కాంగ్రెస్ కు ఏనాడూ  లేదు.. ఉండబోదన్నారు. 

48 ఏళ్లు పాలించిన తమ పాలన లో దేశంలో ఆకలి దారిద్ర్యాలకు కారణం కాంగ్రెస్ పార్టీ నే అని విమర్శించారు.అధికారం కోసం  ఇక్కడి  నేతల స్క్రిప్ట్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు ఇచ్చిన హామీలు భఫూన్, బుడ్డర్ ఖాన్ లను తలపించేలా ఉన్నాయని అన్నారు. ఎలాగైనా అధికారం లోకి రావాలని రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలనే కాపీ చేసి ప్రజలను  మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు. అమలుకు సాధ్యం కానీ అబద్ధాపు హామీలు ఇచ్చే అలవాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేదన్న మంత్రి, నూటికి నూరు శాతం చెప్పిన అమలు చేసి, మ్యానిఫెస్టలో లో చెప్పని పథకాలను సైతం ప్రవేశ పెట్టిన నేత కేసీఆర్ అన్నారు.కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ కు శ్రీరామ రక్ష అన్నారు.

కాంగ్రెస్ వాళ్లు ఏలుతున్న ఏ ఒక్క రాష్ట్రం లో కూడా  నిన్న ప్రకటించిన పథకాలు లేవన్నారు.

రాష్ర్టానికో మ్యానిఫెస్టో తో ప్రజల ను మోసం చేయాలని కాంగ్రెస్  చూస్తుంది అన్నారు.హైదరాబాద్‌లో చెప్పిన హామీలు కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా? అంటూ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో  వారు ఇస్తున్న పెన్షన్లు ఎక్కడా వెయ్యి రూపాయలు కూడా దాటలేదని అన్నారు… కూట్లే రాయితీయలేనొడు ఎట్లే రాయి తీసిన చందంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉందని మంత్రి విమర్శించారు. అబద్ధాలు చెప్పి ప్రజలను  కాంగ్రెస్ పార్టీ మోసగించాలని చూస్తుందన్న మంత్రి జగదీష్ రెడ్డి చైతన్యవంతులైన తెలంగాణ ప్రజల ముందు కాంగ్రెస్ పాచికలు పారవు అన్నారు.

మోడీ పాలన తో విసుగు చెంది కేసీఆర్  వంటి ప్రత్యామ్నాయం లేనందునే ప్రజలు కర్ణాటక లో కాంగ్రెస్ కు ఓటు వేశారని అన్నారు.వారంటీలు లేని గ్యారెంటీలు ఇచ్చి కర్ణాటకను  కాంగ్రెస్ పార్టీ ఆగం చేసింది అన్నారు

తెలంగాణ రాష్ట్రం ఎవరి భిక్ష కాదని, పోరాడి సాధించుకున్నామని మంత్రి  అన్నారు. తెలంగాణ  పోరాటాలను కాంగ్రెస్‌ పార్టీ  పదేపదే అవమానిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్‌ పార్టీ చేసిన కాలయాపన ఫలితంగానే తెలంగాణలో ఆత్మబలిదానాలు జరిగాయని విమర్శించారు. కాంగ్రెస్‌ చర్యలతో తెలంగాణ రెండు తరాల భవిష్యత్‌ను కోల్పోయిందని ఆగ్రహించారు. మంత్రి తో పాటు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్థి లింగయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వైవి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్ పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Narra Paramesh

కాలువలో పడి రైతు మృతి”

మరోసారి ములాఖత్