in , , ,

కాంగ్రెస్ విజయబేరి మహాసభను విజయవంతం చేయాలి… ఆవుల విజయ భాస్కర్ రెడ్డి..!

కాంగ్రెస్ విజయబేరి మహాసభను విజయవంతం చేయాలని  చర్ల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవుల విజయ భాస్కర్ రెడ్డి, పేర్కొన్నారు. ఈ నెల17వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ తుక్కగూడ లో జరగున్నా విజయభేరి మహసభకు తెలంగాణ ఇచ్చిన త్యాగమయి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హజరు కానునున్నారని తెలిపారు. ఈ సభలో రా ష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేయనున్న సంక్షేమ పథకాలను వారు వివరిస్తారని చెప్పారు. అదే విధంగా ఈ సభలో మైనార్టీ, బిసి మహిళ డిక్లరేషన్లను ప్రకటిస్తారన్నారు. కాంగ్రెస్ చేసేదే చెబుతుందని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా రాష్ట్రంలో కాంగ్రెస్కు ఈఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ రుణం తెలంగాణ ప్రజలు తీర్చుకోవాల్సిన తరుణం అసన్నమైందన్నారు. ప్రతి బూత్ నుంచి పార్టీ నాయకులు,కార్యకర్తలు అభిమానులు  సభకు తరలిరావాలని ఆయన కోరారు. ఈ సభకు చర్ల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని విజయ్ భాస్కర్ రెడ్డి కోరారు.

[zombify_post]

Report

What do you think?

Written by K Sravan

ఆశలు వెనక్కి.. కన్నీళ్లు బయటకి#

అనుమతి లేక ఆవేదన*