in ,

కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఒక సీటును మాదిగలకు కేటాయించాలి

— ఎం.అర్. పి. యస్ జాతీయ కార్యదర్శి కొలికపోగు. వెంకటేశ్వరరావు మాదిగ.

కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో ఉన్న రెండు ఎస్సీ రిజర్వేషన్ సీట్లలో ఒక రిజర్వేషన్ సీటును మాదిగ కులస్తులకు కేటాయించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ కార్యదర్శి కొలకపోగు వెంకటేశ్వరావు  కాంగ్రెస్ పార్టీకి సూచించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి ఖమ్మం జిల్లాలో గల రెండు ఎస్సి రిజర్వేషన్ సీట్లు అయిన మధిర, సత్తుపల్లి ని మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే కేటాయిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు .ఖమ్మం జిల్లాలో గల ఐదు నియోజకవర్గాల్లో మాదిగల ఓట్లు 1,78,000 వేలు కాగా,మాలలవి కేవలం 78000 వేలే నని  గుర్తు చేశారు. జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గంలో బలమైన వర్గంగా మాదిగ  కులస్తులు ఉన్నారని అన్నారు.మాదిగల ఓట్ల శాతం 17 శాతం అని,  మాలలవి ఓట్లు 7శాతమే ఉన్నాయని,  కాబట్టి సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మధిర,సత్తుపల్లి నియోజకవర్గాల్లో  మాదిగ కులస్తులకు ఏదో ఒక సీట్ కేటాయించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాలు, కుల సంఘాలు విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకొని ఖమ్మం జిల్లాలో రెండు ఎస్సీ నియోజకవర్గాల్లో ఏదో ఒక సీటు మాదిగలకు  కేటాయించాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి పనిచేస్తామని హెచ్చరించారు.

[zombify_post]

Report

What do you think?

మందస పోలీస్ స్టేషన్ ఎదుట టిడిపి శ్రేణులు నిరసన

ఎమ్మెల్యే రామానాయుడు కు అస్వస్థత