in ,

కల్లూరు లో సాగర్ జలాలు విడుదల పట్ల రైతులు హర్షం

సీఎం కేసీఆర్, ఎమ్మేల్యే సండ్ర  కు కృతజ్ఞతలు తెలిపిన  రైతులు, నాయకులు
సాగర్ జలాలకు కుంకుమ, పూలతో అభిషేకం చేసిన రైతులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు
జయహో కేసీఆర్, జయహో సండ్ర నినాదాలతో కృతజ్ఞతలు తెలిపిన రైతులు
సీఎం కేసీఆర్ , ఎమ్మేల్యే సండ్ర లకు రైతుల అండగా నిలవాలి : నాయకులు

వర్షాభావ పరిస్థతుల్లో ఎండిపోతున్న  రైతుల పంటపొలాలను ఆదుకోవడం కోసం ఎమ్మేల్యే సండ్ర వెంకట వీరయ్య  ప్రత్యేక చొరవతో విడుదల చేసిన సాగర్ జలాలను కల్లూరు మండలం , కప్పలబందం సాగర్ రెగ్యులేటర్ వద్ద  బి అర్ ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు జలాలను పరీశీలించి, పసుపు, కుంకుమ, పూలను జలాల్లో వదిలి ప్రత్యేక పూజలు చేశారు. జయహో కేసీఆర్, జయహో సండ్ర నినాదాలతో హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఎంపీపీ బీరవల్లి రఘు, జెడ్పీటీసీ కట్టా అజయ్ కుమార్, బి అర్ ఎస్ మండల అధ్యక్షులు పాలెపు రామారావు, రై.స.స. మండల కన్వీనర్ డా,, లక్కినేని రఘులు మాట్లాడుతూ
సత్తుపల్లి నియోజకవర్గం స్వతహాగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడం, మరి ముఖ్యంగా వరి సాగు విస్తీర్ణం ఎక్కువ కలిగి ఉండటంతో  వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నయనీ, రైతులు పెద్ద మొత్తంలో వ్యవసాయ పెట్టుబడులు పెట్టి తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితుల్లో ఎమ్మేల్యే సండ్ర వెంకట వీరయ్య  రైతుల పక్షాన ప్రత్యేక చొరవతీసుకొని సీఎం కేసీఆర్ తో మాట్లాడి సాగర్ డ్యాం లో జలాలు తక్కువగా ఉన్నపటికీ రైతులను ఆదుకోవడంలో కోసం సాగర్ జలాలను విడుదల చెపించి తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సహా నియోజకవర్గ రైతులను ఆదుకోవడం హర్షణీయం అని సీఎం కేసీఆర్, ఎమ్మేల్యే సండ్ర లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఎమ్మేల్యే సండ్ర  నిరంతరం ప్రజల పక్షాన పోరాడే ప్రజా నాయకుడనీ,  రైతుల కష్ట సుఖాలు ఎరిగిన నాయకుడని, కొందరు ప్రతిపక్ష నాయకులు ఎన్నికల సీజన్ రావడంతో కొత్త కొత్త అవతారాలతో ప్రజల వద్దకు వస్తున్నారని, ఎన్నికలు పూర్తయిన మరుక్షణం మళ్ళీ నబడరని అలాంటి వారి మాయమాటలకు మోసపోకుండా ప్రజల అవసరాలు గుర్తించి ఆదుకునే తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్, ఎమ్మేల్యే సండ్ర నాయకత్వానికి రైతులు, ప్రజలు అండగా నిలవాలని విజ్ఞాప్తి చేశారు. కార్యక్రమంలో యన్ ఎస్ పీ లో గల నీటి పారుదల అధికారులు, సర్పంచ్ నందిగం ప్రసాద్,  బి అర్ ఎస్ మండల సెక్రటరీ కొరకొప్పు ప్రసాద్ , సర్పంచ్ లు తల్లపురెడ్డి సత్యనారయణ రెడ్డి, గొల్లమందల ప్రసాద్, వల్లభనేని శ్రీనివాసరావు, పుసునూరి శ్రీనివాసరావు, గుర్రాల పెద్ద నర్సిరెడ్డి, యరమల చెన్నారెడ్డి, తల్లపురెడ్డి భద్రారెడ్డి,  వల్లభనేని రవి, పెద్దబోయిన నారాయణ రావు,  మాజీ ఎంపిటిసి వేము కృష్ణ, శీలం నారాయణ రెడ్డి, మోదుగు నాగేశ్వరరావు, మంచాల బొడ్డెయ్య మరియు పలు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

BRS పార్టీకి ఎదురుదెబ్బ… పార్టీ చేరికలతో కాంగ్రెస్ లో జోష్

శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో వరలక్ష్మీ వ్రతం