*కన్యకా పరమేశ్వరి ఆలయంలో కోలాహలంగా కృష్ణాష్టమి వేడుకలు*
నందిగామ సెప్టెంబర్ 6(గురు న్యూస్ ):
నందిగామ పట్టణంలో కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు.
ఆలయ ఆవరణలో లలితా విష్ణు వాసవి జ్ఞాన వాణి ఆధ్వర్యంలో ఆలయంలో కృష్ణాష్టమి సందర్భంగా
భక్తులకు 108 ప్రసాదాలు ఇచ్చారు. అనంతరం ఆలయంలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా తల్లిదండ్రులు తమ చిన్నారులను శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో అందంగా ముస్తాబు చేసి అలంకరించి చేతి వెన్న ముద్ద చెంగల్వ పూదండ.. బంగారు మొలతాడు పట్టుదట్టి సందే.. దావీదులు సరిమువ్వ గజ్జెలు.. చిన్ని కృష్ణ నిన్ను చేరుకొలుతూ.. అంటూ చిన్నారులు ఆటపాటలతోసందడి చేశారు. తమ చిన్నారులు చిలిపి అల్లరి కి ఆనందం వ్యక్తం చేసిన తల్లిదండ్రలు భక్తులందరూ భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
చిన్నారులకు పోలా రవి కిషోర్ శారద బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో వెచ్చా మాధవి, మారం విశాలాక్ష్మి,వనమా పద్మావతి,రాజ్యలక్ష్మి,మారం సత్యవతి,పద్మ, కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు, లలితా విష్ణు వాసవి జ్ఞానవాని సభ్యులు పాల్గొన్నారు.
[zombify_post]


