ఔటర్ రింగ్ రోడ్డులో కదం తొక్కిన ఐటీ రంగం
ఎన్టీఆర్ జిల్లా నందిగామ
చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డు ఫైనాన్స్ డిస్టిక్ నుంచి పటాన్ చెరువు వరకు ఐటీ ఉద్యోగులు, ఐటీ రంగం నిపుణులు, ఆంధ్ర టిడిపి నాయకులు భారీగా ప్రదర్శన నిర్వహించారు. అభివృద్ధికి మారుపేరు చంద్రబాబు అని, హైదరాబాదు సిటీ అభివృద్ధికి, ఐటీ రంగం రావడానికి కారణం చంద్రబాబు కారణం అన్నారు. అలాంటి మహా నాయకుడు కక్షపూరితంగానే ముఖ్యమంత్రి జగన్ అరెస్టు చేయించారని పలువురు తెలిపారు. ఈ ప్రదర్శన కార్యక్రమంలో నందిగామ ప్రాంతానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు కోవెలమూడి సురేష్, ఐటీ రంగం ప్రతినిధులు చేకూరి సతీష్, కోవెలమూడి శివకృష్ణ, ప్రోగ్రాం కోఆర్డినేటర్ గోదావరి తాతబ్బాయి తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]
 
			
			 
					
 
			
					
