డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం లో
కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి పుణ్యక్షేత్రం భక్త జనులతో పోతెట్టుతుంది.ఏడు శనివారాల వెంకన్న దర్శనం కోసం భక్తజనులు వేలాదిగా బారులుతీరడంతో ఆలయ ప్రాంగణం గోవిందనామ స్మరణతో ఏడువారాల స్వామి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అనే భక్తుల నానుడి తో రాష్ట్రం నలుమూలనుండీ భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ దిశలో ప్రతి రోజూ తెల్లవారుజామున ఆలయ సన్నిధి లో లక్ష్మీ హెూమం నిర్వహించి స్వామివారి సుప్రభాత సేవ మంత్రపుష్పంతో అభిషేకిస్తారు. అనంతరం స్వామి వారి కి మొదటి హారతి సమర్పించి తదనంతరం స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. చందన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కాలినడకన వచ్చే భక్తులు శుక్రవారం సాయంత్రానికి ఆలయానికి చేరుకుని ప్రకాడ మండపంలో విశ్రాంతి తీర్చుకుంటారు. శనివారం తెల్లవారుజామున గౌతమీ గోదావరి లో తల స్నానాలు ఆచరించి స్వామివారికి తలనీలాలు సమర్పించి అనంతరం చందన వెంకన్న నిలువెత్తు దర్శనానికి ఆలయ మాడవీధుల్లో ఏడు ప్రతిక్షణాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు.ప్రతి శనివారం ఏడు వారాల నోము నోసుకొనే భక్తులు దాదాపుగా 50 వేల నుండి 75 వేల వరకు ప్రతి శనివారం ఆలయానికి తరలివస్తున్నారు. రాష్ట్ర నలు దిక్కులు నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వేలాది గా భక్తులు తరలి వచ్చి ఏడు వారాల వెంకటేశ్వర స్వామి నోము నోసుకొని స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకోసం చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. దేవస్థానం పాలకమండలి చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ ఈవో ముదునూరు సత్యనారాయణ రాజు, పెనుమత్స సురేష్ రాజు, సెనగన సత్యనారాయణ, మన్యం భాను ఇతర పాలకమండలి సభ్యులు, సిబ్బంది.. భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు.
[zombify_post]


