in ,

ఎస్సీ వర్గీకరణ ద్వారానే మాదిగ ఉప కులాలకు సమన్యాయం

ఎస్సీ వర్గీకరణ పై  మాట ఇచ్చిన రాజకీయ ప్రధాన పార్టీలు నిలబెట్టుకోవాలి: సునీల్ మాదిగ

మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు

ప్రస్తుత కేంద్ర ప్రత్యేక పార్లమెంట్ సమావేశంలో ఎస్సీల వర్గీకరణ బిల్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ సత్తుపల్లి ఎమ్మార్వో కార్యాలయం కేంద్రంగా రిలే నిరాహార దీక్షలు ప్రారంభం అయ్యాయి. సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ పగిడికత్తుల ఈదయ్య మాదిగ అధ్యక్షతన జరగగా ముఖ్యఅతిథిగా MRPS జిల్లా అధ్యక్షుడు కూరపాటి సునీల్ మాదిగ పాల్గొన్నారు. ఎస్సీల వర్గీకరణపై ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉండబడే కాంగ్రెస్ BRS, బిజెపి పార్టీలు ఇచ్చిన మాట నిరూపించుకొని మద్దతు ఇవ్వాలని అధికారంలో వచ్చిన బిజెపి 100 రోజులో వర్గీకరణ చేస్తానని ఇచ్చిన మాట నిరూపించుకోవడానికి బిజెపి ప్రభుత్వ చిట్టచివరి ప్రత్యేక పార్లమెంట్ సమావేశంలో వర్గీకరణ బిల్లు ఆమోదించి ఇక మాదిగ మాదిగ ఉప కులాలకు సమ న్యాయం చేయాలని కోరటం జరిగింది. కాంగ్రెస్, BRS పార్టీలు వర్గీకరణకు మద్దతు ఇచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జొన్నలగడ్డ వెంకటేశ్వర్లు మాదిగ, గొల్లమందల ముత్తారావు మాదిగ, కలపాల ఏసు మాదిగ, కనకపుడి రవి మాదిగ, కోట ప్రసాద్ మాదిగ, గొలముడి శీను మాదిగ, తోళ్ళ అర్జున్ రావు మాదిగ, పరిగడుపు లక్ష్మణరావు మాదిగ, అంబోజు నాగేశ్వరావు మాదిగ, తుంగ వెంకటేశ్వరావు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

సులభ వాయిదాలలో ఋణాలు వసూలు చేసుకోండి

కోటబొమ్మాలి లో వ్యక్తి మృతదేహం