చంద్రబాబు అవినీతి చిట్టాలు బయటకు వస్తాయి: ఎమ్మెల్సీ దువ్వాడ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి చిట్టాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. శనివారం టెక్కలిలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన ఐటీ స్కామ్ లో రూ.118 కోట్ల అవినీతి కాకుండా మరెన్నో స్కాముల్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. నీతి, నిజాయితీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు బండారం బయట పడింది అన్నారు.
[zombify_post]
