in ,

ఎన్నాళ్లీ ఆవేదన?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు అధ్వానంగా ఉంటున్నాయి.చర్ల, దుమ్ముగూడెం మండలంలోని కొన్ని గ్రామాల్లో అయితే కాలినడక కూడా కష్టంగా ఉంటోంది. ఇక వర్షాకాలమైతే పరిస్థితి వర్ణణాతీతం.ఒక వైపు సరైన రహదారుల్లేక మరోవైపు ఉప్పొంగే వాగులు దాటలేక జనం అవస్థలు పడుతున్నారు.వైద్య అవసరాలకు ఆసుపత్రులకు వెళ్లాలంటే అంబులెన్స్లు గ్రామంలోకి రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గర్భిణులు ప్రసవాలకు వెళ్లే సమయంలో అతి కష్టం మీద జడ్జీలపై వాగులు దాటుతున్న పరిస్థితులను చూస్తుంటే మన్యం వాసుల రహదారి కష్టాలు ఎంతమేరకున్నాయో అర్థమవుతోంది.సుమారు 3నుంచి 5 కిలోమీటర్లు గర్భిణులను మోసుకుపోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. వర్షాకాలంలో రహదారులు లేని చోట గర్భిణులను ముందస్తుగా వైద్యశాలలకు తరలించాలని కలెక్టర్, డీఎంఅడ్ హెచ్వో ఆదేశాలు జారీ చేస్తున్నా వైద్యాధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రసవం సమయంలో ఆదివాసీ మహిళలు నరకం చూస్తున్నారు.ఈ క్రమంలో కొందరు ఇళ్లవద్దే ప్రసవిస్తున్నారు.అలాగే జెడ్డీలపై మోసుకొస్తున్న సమయంలో అడవుల్లో ప్రసవించిన ఘటనలూ ఉన్నాయి.రోడ్లు లేని గ్రామాలు చర్ల మండలంలోని కొన్ని గ్రామాలకు ఇప్పటికీ సరైన రహదారులు లేవు. ఎర్రంపాడు, బక్కచింతల పాడు,కందిపాడు, కుర్కట్పాడు,కిష్టారంపాడు, ఆర్సీ పురం గిరిజనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఆయా గ్రామాల్లో సుమారు 2వేల మంది ఆదివాసీలు జీవనం సాగిస్తున్నారు. అత్యవసర సమయంలో జెడ్డీలు కట్టి రోగులను వైద్యశాలలకు తరలిస్తున్నారు. గతంలో ఎర్రంపాడు, బత్తిని పల్లి, రాళ్ళపురం ఇలా అనేక గ్రామాలకు చెందిన గర్భిణులను జెడ్డీలపై మోసుకొచ్చిన సందర్భాలున్నాయి.తాజాగా కొర్కట్ పాడు గ్రామానికి చెందిన కట్టం కోసి అనే మహిళను ప్రసవం కోసం జెడ్డీపై వాగుదాటించారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆయా ప్రాంతాల గిరిజన ప్రజలు వేడుకుంటున్నారు..

[zombify_post]

Report

What do you think?

Written by Vinod

భద్రాచలం నియోజకవర్గం

చంద్రబాబు నాయుడు అరెస్టు-ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలలో హై టెన్షన్

బైక్ ర్యాలీకి పిలుపునిచ్చిన నిర్మల్ హిందూ శాఖ…