ఎన్టీఆర్ జిల్లా, నందిగామ
చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి బల్లకట్టు నడపకుండా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే బల్లకట్టు నడపాలి అనే నిబంధన ఉన్నప్పటికీ.
ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి చందర్లపాడు మండల నాయకులు గుంటూరు జిల్లా పుట్లగూడెం నాయకులు 50 %50 పర్సెంట్ గా వాటాలు వేసుకుని విచ్చలవిడిగా బల్లకట్టు నడుపుతున్నారు..
బల్లకట్టు ఇంజను చాలాసార్లు నదిలో ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి ఇటువంటి లైఫ్ జాకెట్లు గాని లేవు కనీసం డ్రైవర్లు కూడా లేకుండా అక్కడ పనిచేసే కూలీలతో బల్లకట్టు ఆపరేటింగ్ చేస్తున్నారు.
దీనివలన బల్లకట్టు ప్రమాదం జరిగి మునిగిపోయే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఈ దృశ్యం పెట్టిన సమయం సుమారు అర్ధరాత్రి రెండు గంటల సమయం లో కూడా బల్లకట్టు తిరుగుతున్నది.
కానీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఇలా జరుగుతుందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
గతంలో ఇదే ప్రాంతంలో బలకట్టు ప్రమాదం జరిగి చాలామంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి కనుక అధికారులు స్పందించి నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బల్లకట్టు ను సీజ్ చేయాలని ప్రయాణికులు ప్రజలు కోరుతున్నారు.
ఇదే విధంగా అధికారులు పట్టించుకోకుండా బలకట్టు తిరిగితే ప్రజలే వెళ్లి బల్లకట్టు ఆపే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
[zombify_post]

