కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకుని గిరి యువత ఆర్థికంగా స్థిరపడాలని పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ అన్నారు. సోమవారం పాడేరు ఎంపీడీవో కార్యాలయంలో పాడేరు , హుకుంపేట, జి.మాడుగుల మండలాల్లో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉపాధి హామీ పథకంలో వంద రోజులు పని పూర్తి చేసుకున్న వారి పిల్లలకు ఉచితంగా ఉపాధి అవకాశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసున్న అభ్యర్థులకు 15 రోజులు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్శారు. శిక్షణ కాలంలో రోజుకు 275 రూపాయలు ఇస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ఈనెల 6న పెదబయలు ముంచంగిపుట్టు మండలాలు, ఈనెల8న అరకులోయ అనంతగిరి మండలాలు, ఈనెల 11న చింతపల్లి, గూడెం కొత్త వీధి కొయ్యూరు మండలాల్కాలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపీడీ గిరిబాబు, ఎంపీడీవో వెంకటరావు, జేడీ కళ్యాణి, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]
 
					
 
			
			 
			
					
