దత్తిరాజేరు మండలంలోని పోరలి గ్రామంలో సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో జరిగిన కార్యక్రమంలో 63 మంది నేత్ర రోగులకు పరీక్షలు నిర్వహించి 31 మందిని శస్త్ర చికిత్సకు చేసి విశాఖలోని శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రికి తరలించారు. అధ్యక్షులు సాయికుమార్, క్యాంపు సమన్వయకర్త వెంకటరమణ సిబ్బంది పాల్గొన్నారు.
[zombify_post]
