పాడేరు, అల్లూరి జిల్లా: ఈనెల 15వ తేదీలోగా జిల్లాలో ఈ క్రాప్ బుకింగ్ పూర్తిచేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ విసి హాల్ నుండి తహసీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులతో ఈక్రాప్ బుకింగ్, ఓటర్ నమోదు, మృతి చెందిన ఓటర్ల తొలగింపుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 38 వేల ఎకరాలకు ఈక్రాప్ బుకింగ్ పూర్తి చేశారని చెప్పారు. జిల్లాలో 1లక్ష 58 వేల ఈక్రాప్ బుకింగ్ చేయాల్సి ఉందని అన్నారు. పీఎం కిసాన్ అనర్హుల జాబితాను సమర్పించాలని స్పష్టం చేశారు. పీఎం కిసాన్ కు సంబంధించి 17 వేల రికార్డులను పరిశీలించాలని సూచించారు. ఈ కేవైసీ, మ్యు టేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆధార్ సమస్యలు ఉంటే వీఆర్వో యాప్ లో పరిష్కరించాలని సూచించారు. మృతి చెందిన ఓటర్లు, రెండు సార్లు నమోదైన ఓటర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జె. శివ శ్రీనివాసు ఐటిడిఏ పిఓ వి. అభిషేక్, డిఆర్వో పి .అంబేద్కర్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.బి. ఎస్.నంద్, తాసిల్దార్లు, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]


