in ,

ఇరిగేషన్ అధికారి ఎవరో ఎవరికి ఎరుక

  • –  మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో కూడా  హాజరుకాని సంబంధిత శాఖ అధికారులు

    – పాడుబడిన గదిలో  దిక్కు దివానాలేని  కార్యాలయం

    మందస మండలం  హరిపురం సెక్షన్  నీటిపారుదల శాఖ  సహాయ ఇంజనీర్ అధికారి ఎవరో  తెలియని విచిత్ర పరిస్థితి రైతులకు  నెలకొంది. గతంలో ఇరిగేషన్ సెక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఎస్ వి శ్రీనివాసరావును క్వాలిటీ కంట్రోల్ కు బదిలీ చేశారు. అప్పటినుండి  పరిస్థితి మరింత దిగజారింది.పాత తాసిల్దార్ కార్యాలయంలో ఒక మూల పాడుబడిన గదిలో ఇరిగేషన్ కార్యాలయం  దిక్కు దివానా లేకుండా తాళాలు వేసి ఉంటుంది.  దీంతో పలు సమస్యలు నిమిత్తం ఇరిగేషన్ శాఖకు సంప్రదించాల్సిన రైతుల పరిస్థితి అతిగతి లేకుండా పోయిందనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశానికి కూడా  ఇరిగేషన్ శాఖ కు సంబంధించి  అధికారి ఎవరు హాజరు కాకపోవడంతో  పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలాస ఇంజనీరింగ్ అధికారి పి మధును ఇక్కడ ఇన్చార్జిగా నియమించినట్లు  తెలుస్తున్నా చార్జ్ ఇంకా అప్పగించారో లేదో తెలియని పరిస్థితి నెలకొంది .ఇరిగేషన్ శాఖకు రెగ్యులర్ ఇంజనీరింగ్ అధికారిని నియమించాలని పలువురు రైతులు కోరుతున్నారు. మరోవైపు మందస మండలంలో సాగునీటి వనరులను  అభివృద్ధిపరిచి  రైతులను ఆదుకోవాలని పలువురు రైతు సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Chandu

Chandu Working As a Special Correspondent From Palasa Assembly

మానవత్వం చాటుకున్న : దుబాయ్ కరిముల్లా

రాహుల్ భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో సత్తుపల్లిలో భారీ ర్యాలీ తీసిన మానవతారాయ్