పాడేరు, అల్లూరి జిల్లా: భారతదేశంలో ఇంజనీర్ల దినోత్సవము సెప్టెంబరు 15న జరుపుకుంటారు. సుప్రసిద్ధ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టినరోజుని ఇంజనీర్ల దినోత్సవముగా జరుపుతారు. ఈయన భారతదేశంలో అనేక నదులపై ఆనకట్టలు, వంతెనలు కట్టి నీటిపారుదల, త్రాగునీరు పథకాల ద్వారా జలవనరుల సద్వినియోగానికి అంతర్జాతీయంగా పేరుపొందాడు. ఈ సందర్భంగా శుక్రవారం ఐటిడి ఏ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జెసి జె. శివ శ్రీనివాసు, ఐటి డి ఏ పి ఓ వి. అభిషేక్ ఇంజనీర్లకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఇ ఇలు డి. వి. ఆర్. ఎం.రాజు, కె. వేణుగోపాల్, పంచాయతీ రాజ్ ఇ ఇ టి.కొండయ్యపడాల్, పి ఐ యు ఇ ఇ కె.లావణ్య కుమార్, రహదారులు భవనాల శాఖ ఇ ఇ బాల సుందర బాబు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇ ఇ లీలా క్రిష్ణ,పలువురు డి ఇ ఇలు, ఎఇఇలు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]


