రహదారిపై వ్యర్థ పదార్థాలతో వాహనదారులు ఇబ్బందులు
రహదారి పక్కన వ్యర్ధపదార్థాలతో వాహనదారులు పాదచారులు ఇబ్బందు లు పడుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆముదాలవలసవలస పట్టణంలోని పలు కళ్యాణ మండపాలలో జరిగే విందు వినోదాలలో మిగిలిన ఆహార పదార్థాలను రహదారి పక్కన పడవేయడంతో దుర్గంధభరితమైన వాసనలు వెదజల్లడంతో రహదారిపై వెళ్లే ప్రయాణికులు వాహనదారులు పాదచారులు ముక్కు మూసుకుని వెళ్లే పరిస్థితులు నెలకొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వీటిపై దృష్టి సారించాలని కోరుతున్నారు
[zombify_post]


