జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేసారు.ఈసందర్భంగా ఆశ వర్కర్లు, నాయకురాలు మాట్లాడుతూ… ఆశా వర్కర్లకు పారితోషికాలను రూ. 26,000/- లకు పెంచి ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలని, ఇన్ని పనులు నిర్వహిస్తూ పేద ప్రజలకు సేవలందిస్తున్న ఆశాలకు నేటికీ ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయకపోవడం వలన ఆశా వర్కర్లు అన్యాయానికి గురవుతున్నారని ఆశ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా మంగళవారం నుండి సమ్మె చేపడతామని అందుకుగాను ఈరోజు డిఎంహెచ్వో కు వినతి పత్రాన్ని అందజేసి సమ్మె కు అనుమతి ఇవ్వాలని ఈరోజు జిల్లాలోని ఆశ వర్కర్ల అందరంకుండా రావడం జరిగిందని వారు తెలిపారు.
[zombify_post]
 
					
 
			
			 
			
					
