పాడేరు అక్టోబరు 4 : జిల్లాలో ఉన్న 1లక్ష 10 వేల మంది ఆర్ ఓ ఎఫ్ ఆర్ రైతులకు 150 రోజుల పనిదినాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి 22మండలాల ఎంపిడిఓలు , ఉపాధి హామీ అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాబ్ కార్డులు జారీ, సచివాలయం సిబ్బంది హాజరు, జనన మరణ దృపపత్రాలు జారీ, ఆధార్ శిబిరాల నిర్వహణ, ఇంటిపన్ను వసూళ్లుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి పనులు కల్పనలో అలసత్వం ప్రదర్శిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంత మంది ఆర్ ఓ ఎఫ్ ఆర్ రైతులకు ఉపాది పనులు కల్పిస్తున్నారని ఎంపిడి ఓలను అడిగి తెలుసు కున్నారు. పెద్ద ఎత్తున పనులు గుర్తించి ప్రతిపాదనలు పంపిస్తే పరిపాలనా పరమైన ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. జాబ్ కార్డు కలిగిన ప్రతీ కుటుంబానికి ఉపాధి పనులు కల్పించాలని ఆదేశించారు. ఉద్యాన వన తోటలకు సంబంధించిన బిల్లులను త్వరితగతిన వెబ్‌సైట్‌లో నమోదు చేస్తే బిల్లులు విడుదలవుతాయన్నారు. బిల్లులు చెల్లింపులకు సత్వర చర్యలు చేపట్టాలని జాప్యం చేయకూడదని స్పష్టం చేసారు. ఎంపిడి ఓ లు సచివాలయం సిబ్బందితో సమావేశాలు నిర్వహించాలని సూచించారు అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలు తనిఖీచేసి గుడ్లు,పాలు , ఇతర సరుకులు నాణ్యతలు, పరిమాణాలు సిబ్బంది హాజరు పట్టీ పరిశీలించాన్నారు. ఉపాధి కూలీల ఆధార్ అధెంటికేషన్ చేయాలని స్పష్టం చేసారు. 18 వేల జనన దృవీకరణ పత్రాలు మంజూరు చేసామని, వాటిని లబ్దిదారులకు పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. మరో 9462 మందికి జనన దృవీకరణ పత్రాలు జారీ అవసరమైన చర్యలను పంచాయతీ సెక్రటరీలు చేపట్టాలని చెప్పారు. ఇంటి పన్నులు వసూళ్లు చేయాలని సూచించారు. అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. అక్రమ నిర్మాణాలు జరిగితే విద్యుత్తు, నీటి సరఫరా చేయకూడదని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి కొండల రావు, డివిజనల్ పంచాయతీ అధికారి పి. ఎస్.కుమార్, ఉపాధి హామీ ఎపిడి జె. గిరిబాబు, డిబిటి మేనేజర్ నరేష్ , 22 మండలాల ఎంపిడి ఓలు, ఉపాధి హామీ ఎపిడి లు, ఎపి ఓలు తదితరులు పాల్గొన్నారు
This post was created with our nice and easy submission form. Create your post!