డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
కొత్తపేట మారుతి సెంటర్ వద్ద విద్యార్థులు బస్సు ఎక్కుతుండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును ముందుకు పోనివ్వడంతో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. స్థానిక సిద్ధార్థ జూనియర్ కళాశాల శతాబ్ది డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రతిరోజు మారుతి సెంటర్ వద్ద అటు ముక్కామల వైపు ఇటు రావులపాలెం వైపు వెళ్లే బస్సులు ఎక్కుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు విద్యార్థులు ఏపీ 05 టిడి 0199 నంబర్ గల అమలాపురం వైపు వెళ్లే బస్సును ఎక్కుతున్నారు.అయితే అక్కడ ఉన్న విద్యార్థులు పూర్తిగా ఎక్కకుండానే డ్రైవర్ నిర్లక్ష్యం గా బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో బస్సు ఎక్కుతున్న నలుగురు విద్యార్థులు క్రింద పడిపోయి గాయపడ్డారు. అయితే విద్యార్థులు పడిపోయినా పట్టించుకోకుండా డ్రైవర్ బస్సును తీసుకుపోయాడు. అక్కడ ఉన్న స్థానికులు ప్రాధమిక వైద్యుడిని పిలిపించి చికిత్స అందించారు.నిర్లక్ష్యం గా బస్సును నడిపిన డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ప్రతీరోజూ పోలీసులు దగ్గర ఉండి విద్యార్థులను బస్సు ఎక్కిస్తున్నారు పోలీసులు లేనప్పుడు బస్సుల్లో విద్యార్థులను ఎక్కించుకోకుండా డ్రైవర్ లు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.దీనిపై సిద్దార్థ కళాశాల ప్రిన్సిపాల్ కట్టా నాగమోహన్ మాట్లాడుతూ విద్యార్థులు పూర్తి స్థాయిలో బస్సులు ఎక్కే వరకు పోలీసులు ఉండాలని అన్నారు.అలాగే ప్రతీ బస్సు కూడా విద్యార్థులను ఎక్కించుకోవాలని సదరు డ్రైవర్ పై అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు
[zombify_post]


