ఆరోగ్య సురక్ష పై అవగాహన కల్పించండి
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కరరావు వైద్య సిబ్బందికి సూచించారు. గంట్యాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రికార్డులు మందుల నిల్వలు పరిశీలించారు. అనంతరం లక్కీడాం వైయస్సార్ హెల్త్ విలేజ్ క్లినిక్ ను సందర్శించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
[zombify_post]
