in

ఆరోగ్య సంరక్షణ సేవలను సంతృప్తి స్థాయిలో అందించడానికే ‘ఆయుష్మాన్ భవ

 జిల్లాలో ఆయుష్మాన్ ఆప్కే ద్వార్ 3.0 ఆయుష్మాన్ కార్డుల పంపిణీ

.. జిల్లా కలెక్టర్  డా.కే. మాధవీలత

ఆరోగ్య సంరక్షణ పథకాలపై అవగాహన పెంచడం, ఆరోగ్య సంరక్షణ సేవలను సంతృప్తి స్థాయిలో అందించడానికే 'ఆయుష్మాన్ భవ' కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని జిల్లా కలెక్టర్  డా.కే. మాధవీలత పేర్కొన్నారు.

బుధవారం స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో వైద్యఆరోగ్య శాఖ ఆద్వర్యంలో 'ఆయుష్మాన్ భవ' దేశవ్యాప్తంగా ప్రారంభమైన కార్యక్రమాలలో భాగంగా రూపొందించిన పోస్టర్లను  జిల్లా కలెక్టరు వైద్యఆరోగ్య శాఖ అధికారులతో  కలసి ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా కలెక్టరు మాధవీలత మాట్లాడుతూ ఆయుష్మాన్ భవ కార్యక్రమం భాగంగా ప్రతి వారం క్షేత్రస్థాయిలో ఆయుష్మాన్ ఆరోగ్య మేళాలు నిర్వహించాలన్నారు. ప్రసూతి, గైనకాలజీ, పీడియాట్రిక్స్, సర్జరీ, ఇ.ఎన్.టి, నేత్రాలు, సైకియాట్రిక్ మొదలైనవాటిలోని నిపుణుల సేవలను సామాజిక వైద్య ఆరోగ్య కేంద్రాల స్థాయిలోకి అందించాలన్నారు. గ్రామాలలో ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పోషకాహార కమిటీ(VHSNC), పట్టణ స్థానిక సంస్థ నేతృత్వంలోని గ్రామీణ ప్రాంతాలకు గ్రామ స్థాయి సభలు, పట్టణ ప్రాంతాలకు వార్డు స్థాయి సభలు  అక్టోబర్ రెండో తేదీన నిర్వహించాలన్నారు. రక్త దానంపై అవగాహన కల్పించాలన్నారు. ఆయుష్మాన్ ఆప్కే ద్వార్ 3.0 ఆయుష్మాన్ కార్డుల పంపిణీ చేయాలన్నారు. జిల్లా స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.  ప్రజలకు విస్తృతంగా 'ఆయుష్మాన్ భవ' కార్యక్రమంపై అవగాహన కల్పించాలన్నారు.  దేశవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య సంరక్షణ సేవల నిర్ధారించడానికి 'ఆయుష్మాన్ భవ' అనేది ఒక వినూత్న కార్యక్రమన్నారు.

ఈ కార్యక్రమంలో  జాయింట్ జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, నగరపాలక సంస్థ కమీషనర్ కే. దినేష్ కుమార్, డిఎంహెచ్ఓ డా. కే. వెంకటేశ్వరరావు, డిసిహెచ్ఓ డా.ఎమ్.సనత్ కుమారి,ఆరోగ్య శ్రీ జిల్లా కోర్డినేటర్ డా. పి.ప్రియాంక, డిఎమ్ఓ డా. వీర్రాజు, ఐసిడిఎస్. పిడి కే. విజయలక్ష్మి, డిఈఓ ఎస్. అబ్రహం, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డా. ఏ.వినూత్న  తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Allagadda CM news

సీతారామ సాగునీటి ప్రాజెక్టులో మిగిలి పోయిన భూ నిర్వాసితులకు నష్ట పరిహారం అందజేయండి.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దీక్ష భగ్నం.