in ,

ఆదివాసీ జాతీయ సదస్సు

ఆదివాసీల జాతీయ సదస్సు భద్రాచలం పట్టణంలో ఈనెల 12, 13న ఆదివాసీల జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఆదివాసీ తెగల సమన్వయకర్త సోయం కన్నరాజు పేర్కొన్నారు. స్థానికంగా ఆదివారం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న పలువురు ఆదివాసీలు మాట్లాడారు. ఆదివాసీ సమన్వయ మంచ్ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాతీయ సదస్సులో ఆదివాసీ సమస్యలపై చర్చించనున్నట్లు సంఘ ప్రతినిధులు వెల్లడించారు. వివిధ రాష్ట్రాల నుంచి సంఘాల నాయకులు హాజరుకానున్న ఈ సదస్సుకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. వీరాస్వామి, క్రిష్టయ్య, పాపారావు, శ్రీను, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Vinod

భద్రాచలం నియోజకవర్గం

ఇంద్రకీలాద్రి పై విరిగి పడిన కొండ రాళ్లు

మందు పాతర నిర్వీర్యం