పలాస జడ్పీహెచ్ ఎస్ లో తెలుగు ఉపాధ్యాయనిగా పనిచేస్తున్న మూల గణపతిరావుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రధానం చేసింది. ఆచార్య వెలమల సిమ్మన్న, ఆచార్య జి. మోహన్ బాబు పర్యవేక్షణలో రామతీర్థ సాహిత్యం-పరిశీలన అనే అంశంపై పరిశోధన చేసినందుకు ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ఏయూ కాన్వకేషన్ హాల్లో శనివారం డాక్టరేట్ ప్రధానం చేసారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో హెచ్ఎం, ఉపాధ్యాయులు ఆయనకు అభినందన తెలిపారు.
[zombify_post]