in ,

అరెస్టులూ.. నిర్బంధాలు..”

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసనగా టెక్కలి నియోజకవర్గంలో ప్రశాంతంగా బండ్ చేశారు. స్వచ్చందంగా ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలలూ మూసివేశారు. కొందరు టీడీపీ నాయకులనూ, కార్యకర్త అరెస్ట్ చేశారు. టెక్కలి ఆర్టీసీ డిపో, హైవేపై నిరసన తెలిపిన నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో బగాది శేషగిరి, కోళ్ల లవకుమార్, కోళ్ల కామేశ్వరరావు, మట్ట పురుషోత్తం, మెండ దమయంతి, దల్లి ప్రసాద్ రెడ్డి, అభిలాష్, రామకృష్ణ, జీరు వెంకట్ రెడ్డి, బాలకృష్ణ, పోలాకి చంద్రశేఖర్, కిరణ్, రాంప్రసాద్ , సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

.నందిగాం లొ:- టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నందిగాంలోనూ,మండలంలోని ఇతర గ్రామాల్లోనూ ప్రశాంతంగా బంద్ చేశారు. కొందరు టీడీపీ నాయకులనూ, కార్యకర్తలనూ ఉదయాన్నే ఇల్లు కదలకుండా హౌస్ అరెస్ట్ చేశారు. అర్ధనగ్నంగా నిరసన తెలిపిన వారినీ, మౌన దీక్ష చేసిన వారినీ అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో పోలాకి చంద్రశేఖర రావు(కింగ్), సబ్బి జానకిరామ్, మదన్ గౌడ్, పుచ్చకాయల నాగరాజు, జీరుమోహన్ రావు, కమిటీ ధర్మారావు, మహేష్, బందావు బాలకృష్ణ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

  చంద్రబాబు అరెస్టు దారుణం
మెండ దమయంతి:
టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ను టీడీపీ టెక్కలి మహిళా అధ్యక్షురాలు మెండ దమయంతి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె జనం ప్రతినిధితో మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించడానికి తన జీవితాన్నే అంకితం చేసిన చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం అన్యాయం అని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే, తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించడంపై మండిపడ్డారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం | లేదని, జగన్, రాజారెడ్డి రాజ్యాంగం మాత్రమే అమలవుతోందని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

సంతబొమ్మాళిలో:

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ కు వ్యతిరేకంగా రాష్ట్ర టీడీపీ పిలుపుమేరకు సంతబొమ్మాళి మండలంలో ప్రశాంతంగా బంద్ చేశారు. అయితే కొందరు టీడీపీ నాయకులనూ, కార్యకర్తలనూ తెల్లవారు జామునే హౌస్ అరెస్ట్ చేశారు. రోడ్డుపై చైతాయించి నిరసన తెలిపిన మరికొంతమందిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో రెండి అరుణ్, కాంతారావు, పంగ అసిరినాయుడు, పంగ సత్యం, కర్రి సత్యం, ఎల్. చక్రవర్తి, రెడ్డి అప్పన్న, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

కోటబొమ్మాళిలో :
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్కు నిరసనగా కోటబొమ్మాళిలో కొత్తపేట జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సును టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్కు నిరసనగా అంద్ చేస్తున్నట్టు తెలుగు మహిళా అధ్యక్షురాలు పూజారి శైలజ చెప్పారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈకార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బోయిన రమేష్ , బోయిన గోవింద రాజులు, హరిప్రసాద్, లార్డ్ శ్రీను, విజయలక్ష్మి, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

ఏజెన్సీలో భారీ వర్షం – ఇళ్లల్లోకి ప్రవేశించిన నీరు”

జాతీయ జెండా ను ఎగుర వేయనున్న మంత్రి పువ్వాడ