in

అన్యాయం ముందు రాజ్యమేలినా అంతిమ విజయం న్యాయానిదే : బండారు

డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :

తెలుగుదేశంపార్టీ ఆదేశాల మేరకు చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టును నిరసిస్తూ రావులపాలెం సెంటర్ నందు సత్యానందరావు ఆద్వర్యంలో కగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ అరాచక పాలనలో కక్ష సాధింపులే మిగిలాయని అన్నారు.అవినీతే జరగలేని స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబునాయుడు ని అరెస్టు చేసి సైకో ఆనందం పొందుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు విజనరీ వల్లే నేడు ఆయన అక్రమ అరెస్టులు నిరసిస్తూ దేశ వ్యాప్తంగానే కాకుండా విదేశాలలో సైతం రోడ్ల పైకి వస్తున్నారని తెలిపారు. అన్యాయం ముందు రాజ్యమేలినా అంతిమ విజయం న్యాయానిదేని అన్నారు. దేశ వ్యాప్తంగా మద్దతు కూడగట్టుకుంటున్న చంద్రబాబు నాయుడు నిజాయితీ పరుడుగా, కడిగిన ముత్యంలా త్వరలోనే బయటకు తిరిగి వస్తారని సత్యానందరావు తెలిపారు..జగన్ అరాచక పాలనలో చీకట్లు అలుముకున్న రాష్ట్రానికి నారా చంద్రబాబునాయుడు ద్వారానే వెలుగు వస్తుందని తెలుగుదేశంపార్టీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు.నియంత, సైకో, పాలన చేతకాని దద్దమ్మ, కక్ష సాధింపులు మాత్రమే తెలిసిన ఈ పనికిమాలిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చంద్రబాబు నాయుడు లాంటి మహోన్నత వ్యక్తి నీతికి నిలువుటద్దంగా నిలిచిన వ్యక్తిని అన్యాయంగా అక్రమంగా అర్థరాత్రి సమయంలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేసి విచారణ పేరుతో అనేక కిలోమీటర్లు తిప్పి రిమాండ్ కు పంపించడానికి ఖండిస్తున్నాం. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు జగన్మోహన్ రెడ్డి తన గొయ్యి తానే తీసుకుంటున్నాడు, అని అన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Kiran

ఔటర్ రింగ్ రోడ్డులో కదం తొక్కిన ఐటీ రంగం

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవ సభను జయప్రదం చేయండి