గణేష్ చతుర్దశి సందర్భంగా పట్టణంలో గణేష్ మండపాల వద్ద కానీ నిమార్జనం రోజున కానీ అనుమతులు లేకుండా డిజె లు పెడితే చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిరిసిల్ల టౌన్ సి. ఐ ఉపేందర్ తెలిపారు.
ఈ సందర్భంగా సి.ఐ ఉపేందర్ మాట్లాడుతూ..
సిరిసిల్ల పట్టణ పరిధిలో గల 24 మంది డిజె ఓనర్ లను బైండ్ఓవర్ చేసి టౌన్ తహసీల్దార్ ముందు హాజరు పర్చడం జరిగిందన్నారు. ఎటువంటి అనుమతి లేకుండా పట్టణంలో డిజె లు ఉపయోగిస్తే వారి పై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.పోలీస్ వారి సూచనలు అతిక్రమించి ఎవరైనా డిజె లు పెడితే అట్టి డిజె లను సీజ్ చేసి కేసులు నమోదు చేయటం జరుగుతుంది అని రాబోవు వినాయక చవితి దృష్టిలో ఉంచుకొని అనుమతి లేకుండా డిజె పెట్టవద్దని హెచ్చరించారు.
[zombify_post]


