in ,

అగ్రిగోల్డ్ కుంభకోణం.. ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ

హైదరాబాద్: అగ్రిగోల్డ్ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఛార్జిషీట్ దాఖలు చేసింది. అగ్రిగోల్డ్ ప్రమోటర్లు ఏవీ రామారావు, శేషునారాయణరావు, హేమసుందర వరప్రసాద్‌ పేర్లను ఛార్జ్‌షీట్‌లో చేర్చింది.అగ్రిగోల్డ్ ఫామ్ ఎస్టేట్స్ సహా 11 అనుబంధ కంపెనీలపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు విచారణకు స్వీకరించింది. అక్టోబరు 3న కోర్టుకు హాజరుకావాలని అగ్రిగోల్డ్ ప్రమోటర్లు, కంపెనీల ప్రతినిధులకు కోర్టు సమన్లు జారీ చేసింది. 32 లక్షల మంది డిపాజిటర్లను రూ.6,380 కోట్ల మేర మోసం చేసినట్లు అగ్రిగోల్డ్‌పై అభియోగాలు దాఖలయ్యాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రూ.4,141 కోట్ల మేర ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది..

[zombify_post]

Report

What do you think?

Written by Allagadda CM news

జి 20 సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా మారిన నటరాజ ప్రతిమ…

ఉద్యోగుల క్రమబద్ధీకరణ బడ్జెట్ కొరత లేదు-ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి