అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి
అంగన్వాడీలను
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.
నిర్మల్ ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆఫీసు ముట్టడి
నిర్మల్ టౌన్ : అంగన్వాడీ ఉద్యోగ
సంఘాల జాయింట్ యాక్షన్ కమిటి (ఏఐటియుసీ,
సిఐటియు) ఆధ్వర్యంలో సమ్మెలో భాగంగా గురు
వారం రోజున నిర్మల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీసు
ముట్టడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటి
యుసీ కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ అంగన్వాడీ
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర
ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గత మూడు రోజు
లుగా అంగన్వాడీ ఉద్యోగులు శాంతియుతంగా సమ్మె
చేస్తుంటే సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వమే
అంగన్వాడీ ఉద్యోగులను రెచ్చగొట్టే విధంగా అంగన్
వాడీ సెంటర్ల తాళాలు పగులగొట్టడం చాలా దారుణం.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమ్మె చేస్తున్న
సంఘాలను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించా
లని లేకుంటే సమ్మె తీవ్రంగా ఉంటుందని, దానికి ప్రభు
ప్రజాపక్ష
త్వమే బాధ్యత వహించాల్సిందే అని అన్నారు. సిఐ
టియు కార్యదర్శి బొమ్మల సురేష్ మాట్లాడుతూ తెలం
గాణ రాష్ట్రం వస్తే మా బ్రతుకులు బాగుపడుతాయని
అనుకున్నాం. కానీ నేటికి ప్రభుత్వం మా బాధలు పట్టిం
చుకోవడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డ
లకు న్యాయం ఎక్కడుందో ప్రభుత్వం చెప్పాలని, నిర్మల్
ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయానికి జన్నారం
మండలం నుంచి వస్తుంటే పోలీసులు మద్యలో ఆపేసి
అందరిని అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ
అక్రమ అరెస్ట్లను మేము ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర
కార్యదర్శి శైలజా, జిల్లా అధ్యక్షులు రాజమణి, జిల్లా
ఉపాధ్యక్షురాలు శైలజ, సభ్యురాలు దేవి, సరోజ,
భూలక్ష్మి, శశికళ, లలిత, విజయ, పాల్గొన్నారు.
[zombify_post]

