Lokesh Delhi Tour: చంద్రబాబు అరెస్టు నేపధ్యంలో రెండ్రోజుల్నించి చంద్రబాబు కుటుంబీకులు రాజమండ్రిలోనే ఉన్నారు, ఇవాళ కాస్సేపటి క్రితం నారా లోకేశ్, అతని తల్లి నారా భువనేశ్వరిలు హుటాహుటిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ , ఇతర పరిణామాలు, ఏపీలో పరిస్థితుల్ని నేషనల్ మీడియా ముందు నారా లోకేశ్ వివరించనున్నారని తెలుస్తోంది. నాలుగేళ్లలో ఏపీలో జరిగిన అరాచకాలు దేశంలో మరెక్కడా జరగలేదని జాతీయ మీడియాకు లోకేశ్ వివరించనున్నారు.
