*KVPS 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంతేకుడ్లుర్ లో జెండా ఆవిష్కరణ*
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు చేరుకున్న సందర్భంగా ఆదోని మండలం సంతేకూడ్లూరు గ్రామంలో జెండాను కెవిపిఎస్ గ్రామ నాయకులు రాము గారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి కెవిపిఎస్ జెండాను ఆవిష్కరించడం జరిగింది.
కార్యక్రమానికి కెవిపిఎస్ మండల కార్యదర్శి తిక్కప్ప అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న మాట్లాడుతూ కేవీపీఎస్ 1998 సంవత్సరం అక్టోబర్ రెండో తేదీన ఏర్పాటు చేసుకొని ఆనాటి నుండి ఈనాటి వరకు కుల వివక్షత అంటరానితనం దళితులపై దాడులు దౌర్జన్యాలు మరియు దళిత కాలనీల అభివృద్ధి కోసం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల కోసం అనేకమైన ఉద్యమాలు చేసిందని తెలిపారు. కెవిపిఎస్ ఆవిర్భావం అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఆందోళన ఫలితంగా అప్పటి ప్రభుత్వం జస్టిస్ పున్నయ్య గారితో కమిషన్ ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడం జరిగిందని తెలిపారు. దేశంలో ఇప్పటికే దళితులపై దాడులు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయని, రాష్ట్రంలో కూడా కులవివక్షత, అంటరానితనం ఇంకా అనేక గ్రామాల్లో కొనసాగుతుందని దీన్ని రూపుమాపడానికి కేవీపీఎస్ ను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ గ్రామ నాయకులు రాజుకుమార్, వీరేష్ ఎల్లప్ప, మధు, అమ్రేష్,వీరస్వామి,నాగరాజు,రామప్ప,ఏలీయా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!