మగ బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు అనుకుంటే పురిటిలోని చనిపోయాడు
*కొడుకు చనిపోవడానికి డాక్టర్ భారతి కారణం
*ఏడేళ్ల తర్వాత కొడుకు కోసం ఆసుపత్రికి వస్తే శవాన్ని చూడాల్సి వచ్చింది
*లబోదిబోమని గుండెలు బాదుకున్న భార్యాభర్తలు బంధువులు
మగ బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు అనుకుంటే పొరటిలోని చనిపోయాడని కొడుకు చనిపోవడానికి డాక్టర్ భరత్ కారణమని ఏడేళ్ల తర్వాత గర్భం దాల్చి కాన్పు కోసం బోయ మహాలక్ష్మి ఆసుపత్రికి వస్తే కాన్పులో డాక్టర్ భారతి నిర్లక్ష్యం కారణంగా పుట్టిన మగ బిడ్డ చనిపోయాడని బోయ మహాలక్ష్మి సురేష్ దంపతులు వాపోయారు. భగవంతుడు మగ బిడ్డకు ఊపిరి పోస్తే బయట ప్రపంచాన్ని చూపించి ఊపిరి పోయాల్సిన డాక్టర్ ప్రాణాలు తీశారని దైవసంకల్పమా లేక డాక్టర్ నిర్లక్ష్యమా అంటే ఏడు సంవత్సరాల తర్వాత గర్భం దాల్చడం దైవసంకల్పమేనని ఆరోగ్యంగా మగ బిడ్డ పుడతాడు అని ఆరోగ్యంగా ఉంటాడని డాక్టర్ భారతిని ఆశ్రయించి చూపించుకున్న బోయ మహాలక్ష్మి సురేష్ దంపతులకు పట్టణంలోని ఎస్కేడి కాలనీ జీరో రోడ్లో గత మూడు నెలల క్రితం క్రొత్తగా ప్రారంభించిన సాయి నర్సింగ్ హోమ్ లో డాక్టర్ భారతి కాన్పు చేస్తానని ఆసుపత్రిలో అడ్మిట్ చేయించింది ప్రసవానికి బోయ మహాలక్ష్మిని లోపలికి తీసుకెళ్లిన సమయంలో డాక్టర్ భారతి బోయ మహాలక్ష్మి కడుపు పైన బలంగా రెండు చేతులతో వత్తి వత్తి ప్రసవం చేయడానికి బలవంతంగా ప్రయత్నం చేసి బిడ్డ చనిపోవడానికి కారణం అయిందని బోయ మహాలక్ష్మి సురేష్ బంధువులు వాపోయారు. సుఖప్రసవం కోసం నొప్పులే లేనప్పుడు సిజరిన్ చేయమని చెప్పినా కూడా భార్య భర్తలైన తమ మాటలు తమ బంధువుల మాటలు పెడచెవిన పెట్టి బలవంతంగా నొక్కినొక్కి ప్రసవం చేయడానికి ప్రయత్నించడం వల్లే మగ బిడ్డ చనిపోయి బయటకు వచ్చాడని వాపోయారు. మగ బిడ్డ కావాలనుకున్న తమకు తమ బిడ్డ ఊపిరి ఆడకుండా శవమై కనిపించాడని బోయ మహాలక్ష్మి సురేష్ దంపతులు వారి బంధువులు లబోదిబోమని గుండెలు పగిలేలా రోదించారు.
This post was created with our nice and easy submission form. Create your post!