in ,

శాంతియుత వాతావరణంలో వినాయక చవితి పండుగ జరుపుకోవాలి

ఆదోని డివిజన్ శాంతియుత వాతావరణంలో వినాయక చవితి పండుగ జరుపుకోవాలని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అన్నారు. గురువారం మధ్యాహ్నం మునిసిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో గణేష్ చతుర్థి పండుగ ముందస్తు ఏర్పట్లపై అధికారులు, గణేష్ కమిటీ, మరియు విశ్వహిందూ పరిషత్ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. వినాయక మండపాలు ఏర్పాటు చేసే భక్తులు భక్తిశ్రద్ధలతో పండుగలు జరుపుకోవాలని సూచించారు.గణేష్ శోభాయాత్ర నిర్వహించే మార్గాల్లో రహదారులు మరమ్మత్తులు చేపట్టాలని, విద్యుత్తు అంతరయం కలగకుండా చూడాలని, వేలాడే విద్యుత్ తీగలను సరిచేయాలని అన్నారు. ప్రధాన కూడలి ప్రాంతాల్లో సీసీ కెమెరాలు,  బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో పండుగను విజయవంతం చేయాలని సూచించారు.మద్యం దుకాణాలు ఒక రోజు పాటు మూసి ఉంచాలని ఆదేశించారు.శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి ని జరుపుకోవాలని అన్నారు.ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో  చేసుకోవాలి

[zombify_post]

Report

What do you think?

Written by Ganesh

నిరంతర విద్యుత్ కోతలతో ఆంధ్రప్రదేశ్

ప్రజల వద్దకే నేరుగా పరిపాలన-గొర్లె కిరణ్