in ,

విమానయాన శాఖ మంత్రి ముందు ఆదోని సమస్యల చిట్టా…

విమానయాన శాఖ మంత్రి ముందు ఆదోని సమస్యల చిట్టా…

ఆదోనిని జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ, ఆదోనిలో టిడిపి కార్యకర్తలకు  జరుగుతున్న అవమానం, అన్యాయం గురించి మంగళగిరిలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కి ఫిర్యాదు చేశారు మైనార్టీ పరిరక్షణ సమితి యం.హెచ్.పి.యస్.రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్.
ఆదోని ప్రాంతము కరువు, వలసల వల్ల బీహార్ కంటే బాగా వెనుకబడిన ప్రాంతముగా తయారైందని  ఆదోని ప్రజల పట్ల దయాచూపి ఆదోని డివిజన్ ను ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలని నూర్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నూర్ అహ్మద్ మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదోని అభివృద్ధి కోసం ఏమేమి చేయొచ్చని మంత్రి ప్రశ్నించరని  పారిశ్రామిక అభివృద్ధి వల్ల ఆదోని అభివృద్ధి అయ్యే అవకాశం ఉందని ఆ దిశగా ప్రభుత్వం పని చేయాలని నూర్ అహ్మద్ సూచించామని తెలిపారు. అన్ని విషయాలను జాగ్రత్తగా నోట్ చేసుకొన్న మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో మాట్లాడి ఖచ్చితంగా ఆదోనికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

మంత్రికి వినతి పత్రం అందజేస్తున్న నూరు అహ్మద్

అదేవిధంగా ఆదోని టిడిపి పార్టీ కార్యకర్తలు చాలా మంచివారు, అంకితభావంతో పని చేసే  ఇలాంటి కార్యకర్తలను దూరం చేసుకోవద్దని,ఆదోనిలో గత పదేళ్లు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే చేతిలో నలిగిపోయారని, ప్రస్తుతం కూటమి ఓట్లతో గెలిచిన  బిజెపి ఎమ్మెల్యే పార్థసారధి వైసిపి నాయకులను తమ పార్టీలో చేర్చుకుని వారికే మరలా పనులు  ఆదాయ మార్గాలు చూపుతుండడంతో టిడిపి కార్యకర్తలు వరుసగా పదకొండవ సంవత్సరము కూడా ఇబ్బందులు తెలిపారు. రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చినా  ఆదోని నియోజకవర్గం లో మాత్రం వైసిపి నాయకులదే హవా నడుస్తుందని వైసిపి  నుంచి బిజెపిలో చేరిన నాయకులు కొందరు అరాచకాలు సృష్టిస్తూ ఆదోని అభివృద్ధిని అడ్డుపడుతున్నారని. అక్రమ దందాలకు పాల్పడుతున్నారని కాని వారిపై విచారణ జరిపి శిక్షించాలని కేంద్ర మంత్రిని కింజరాపు రామ్మోహన్ నాయుడు ని నూర్ అహ్మద్ విజ్ఞప్తి చేశామన్నారు.
దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి మాజీ వైకాపా నాయకుల అరాచకాలు అడ్డుకట్ట వేస్తామని, టిడిపి రాష్ట్ర అధ్యక్షునితో విచారణ జరిపించి టిడిపి కార్యకర్తలకు న్యాయం చేస్తామని, ఆదోని టిడిపి కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో  మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్, సంతేకుడ్లూరు గ్రామ ఎమ్ .హెచ్ పి.యస్. అధ్యక్షులు సద్దాం హుస్సేన్,  గౌరవ సలహాదారు కుబేర స్వామి , షేక్షావలి టిడిపి కార్యకర్తలు తుంబళం మల్లికార్జున మరియు జడే కేశప్ప పాల్గొనినట్లు తెలిపారు.

మంత్రికి సమస్యలను వివరిస్తున్న నూర్ అహ్మద్

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు… పురపాలక సంఘం

ఓవర్ బ్రిడ్జి పైనుండి దూకి ఆత్మహత్యాయత్నం.