in ,

రాయలసీమ జోన్ ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు వాయిదా

కర్నూలు జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  రాయలసీమ జోన్ పరిధిలో కర్నూల్ APSP  2  వ బెటాలియన్ లో   సెప్టెంబర్ 5 వ తేది (మంగళవారం) జరగాల్సిన ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను  కర్నూల్ రేంజ్ డిఐజి సెంథిల్ కుమార్ ఐపియస్ వాయిదా వేశారు.కర్నూల్ పట్టణంలో  కురుస్తున్న భారీ వర్షం  కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్నూల్ రేంజ్ డిఐజి యస్. సెంథిల్ కుమార్ ఐపియస్ ఈ విషయాన్ని ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు.సెప్టెంబర్ 5 వ తేది (మంగళవారం) జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షల్ని 2023  సెప్టెంబరు 22 వ తేదికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.సెప్టెంబర్ 5 వ తేదీ దేహదారుడ్య పరీక్షలకు హాజరయ్యే ఎస్సై  అభ్యర్థులు 2023 , సెప్టెంబర్ 22 తేదీ న  రావాల్సిందిగా కర్నూల్ రేంజ్ డిఐజి యస్. సెంథిల్ కుమార్ ఐపియస్ విజ్ఞప్తి చేశారు.

[zombify_post]

Report

What do you think?

Written by Allagadda CM news

అల్లూరి జిల్లా లో తప్పని డోలు మోతలు

మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉచిత చేప పిల్లల పంపిణీ