in ,

భాష్యం స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు.

  1. భాష్యం స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

————————————————— 

పట్టణంలోని భాష్యం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో మంగళవారం ప్రిన్సిపాల్ మాచాని కవిత ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాచాని కవిత మాట్లాడుతూ భారతదేశ  ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజును  మనం బాలల దినోత్సవం వేడుకలు జరుపుకుంటామని తెలిపారు. జవహర్లాల్ నెహ్రూ కి పిల్లలంటే చాలా ఇష్టమని అందుకే ఆయన పుట్టినరోజుని మనదేశంలో చిల్డ్రన్స్ డే గా పరిగణిస్తామని తెలిపారు. అందరూ అనుభవించే బాల్యం భగవంతుడు ఇచ్చిన ఒక అమూల్యమైన వరం అన్నారు. నవంబర్ మాసం అంటేనే బాలలకు పండగ మాసమని ఎందుకంటే ఈ నెల మొత్తం అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు బాలల దినోత్సవాలు జరుపుకుంటారని చెప్పారు. అనంతరం నిర్వహించిన పిల్లలకు నిర్వహించిన ఆటల పోటీల్లో వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు ప్రిన్సిపాల్ బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఉరుకుందు.చాంప్స్ ఇంచార్జ్ అనురాధ.  అధ్యాపక, అద్యపకేతర బృందం విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన మంత్రి కేటీఆర్.

ఘనంగా జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు..