in ,

భాష్యం స్కూల్లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు.

భాష్యం స్కూల్లో అంబరాన్నంటిన  సంక్రాంతి సంబరాలు

పట్టణంలోని భాష్యం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సోమవారం భాష్యం స్కూల్స్ రాయలసీమ జోన్ జెడ్ఈవో అనిల్ కుమార్ ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్ కవిత ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్థులు వేసిన హరిదాసు వేషాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పండుగ మూడు రోజులు జరిగే ఒక్కరోజు ఒక్కో విశేషాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాచాని కవిత మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ రైతుల పండుగ ఈ సంక్రాంతి అన్నారు . రైతులు తమ పండించిన పంటను ఇళ్ళకు తెచ్చుకొని సంతోషంగా సంక్రాంతి పండుగ వేడుకలను జరుపుకుంటారనిచెప్పారు. సంక్రాంతి పండుగ జీవితాల్లో వెలుగునిస్తూ రైతు కుటుంబాలలో ఆనందాన్ని కల్పిస్తుందని పేర్కొన్నారు. అనంతరం ముగ్గిల పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రిన్సిపాల్  బహుమతులు ప్రధానం చేశారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో   చాంప్స్ ఇంచార్జ్ అనురాధ, అధ్యాప, అధ్యాపాకేతరకే సిబ్బంది విద్యార్థినీలు, తదితరులు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

ఎస్సీ హాస్టల్ లోని విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి.

ఆదోని మాతా శిశు ఆసుపత్రి ఉపరితలం పై ప్రహరీ గోడను నిర్మించండి.