in ,

బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక

*బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు*

      ఆదోని డివిజన్ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయం నందు రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడమైనది.

  ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ నూతన కొలువుదీరిన ప్రభుత్వం బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామని గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు హామీ ఇచ్చారు.కావున బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి.అలాగే బీసీలకు నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పించాలి, బీసీ హాస్టల్స్ కు నూతన భవనాలు ఏర్పాటు చేయాలి. మరియు ఉన్న వాటికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. కోరారు

  అలాగే కేంద్రంలో ప్రధాన మంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు ఓబీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి,

 అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. అని డిమాండ్ చేయడమైనది.

     ఈ సమావేశంలో డివిజన్ గౌరవ సలహాదా రులు దేవి శెట్టి ప్రకాష్, తాలూకా గౌరవ సలహాదారులు బండారి రాజేశ్వరరావు, ఆదోని పట్టణ ఉపాధ్యక్షులు వడ్డే శ్రీనివాసులు,పట్టణ గౌరవ సలహాదారులు, డాక్టర్ యు సోమశేఖర్, కపటి వీరభద్ర, మల్లే శ్వరప్ప,M.ఉరుకుందు తదితరులు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి లేఖ

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు