ఆదోని మండలంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని సబ్ కలెక్టర్ గారికి సిపిఎం వినతి
ఆదోని మండలంలో వివిధ గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే లింగన్న, మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి వీరారెడ్డి,D, రామాంజనేయులు, మండల కమిటీ సభ్యులు తిక్కప్ప, లక్ష్మన్న,లతో కూడిన సిపిఎం ప్రతినిధి బృందం ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో నెమలికల్లు ఎస్ఎస్ ట్యాంక్ ద్వారా 16 గ్రామాలకు త్రాగునీరు ఒకే పైపులైన్ ద్వారా త్రాగునీరు సరఫరా చేయడం వల్ల, మధ్యలో పైప్ లైన్ రిపేర్లు రావడంతో ఆ గ్రామాలకు వారం నుండి పది రోజులు పాటు నీళ్లు అంది అవకాశం లేదని, వెంటనే రెండో పైప్లైన్ ఆరెకల్ వరకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
గనేకల్ గ్రామంలో శవాల్ని స్మశానానికి తీసుకెళ్లేటప్పుడు రైల్వే ట్రాక్ దాటి వెళ్లాల్సి వస్తుందని ఈ సందర్భంగా ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయని, స్మశానానికి రాస్తా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కుప్పగల్లు గ్రామంలో స్మశానం ఏర్పాటు చేయాలని కోరారు.
పెద్ద తుంబలం గ్రామంలో లెవెన్ కె.వి విద్యుత్ మిద్దెలకు ఆ నుకుని వెళ్లాయని, వాటిని మార్చాలని కోరారు.
మధిర గ్రామంలో 2001లో ఇచ్చిన పట్టాల లబ్ధిదారులకు ఇంటి స్థలం చూపించాలని డిమాండ్ చేశారు.
ఇస్వి ,జాలమంచి, నాగలాపురం, పాండవగల్ నుండి కుప్పగల్ స్టేషన్ వరకు రోడ్లు మరమ్మత్తులు చేయాలని, గనేకల్ జగనన్న కాలనీ పక్కన వంకపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, హైకోర్టులో పెండింగ్లో ఉన్న పాండవగల్ పెద్ద చెరువు సమస్య వెంటనే పరిష్కరించాలని, తదితర సమస్యలు కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి పరమేష్, పార్టీ సభ్యులు ఆయన్న, కార్యకర్తలు సిద్దు, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
*ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ గారు మాట్లాడుతూ మీరు ఇచ్చిన డిమాండ్లను వివిధ శాఖల వారికి పంపుతానని వెంటనే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు*
This post was created with our nice and easy submission form. Create your post!