*ఎన్నో ఉద్యమాల ద్వారా సాధించుకున్న అప్రెంటిష్ విధానం రద్దు ను ఈ ప్రభుత్వం ప్రస్తుత డీఎస్సీ లో పునరుద్ధరించే నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలి… ఎస్టీయూ*
డీఎస్సీ 20 వేలు పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలి…ఎస్టీయూ
నేడు స్థానిక ఆర్.ఆర్.లేబర్ కాలనీ మునిసిపల్ ఉన్నత పాఠశాలలో ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్&రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ జి.వీరచంద్ర యాదవ్,జిల్లా ఉపాధ్యక్షుడు వి.రమేష్ నాయుడు మాట్లాడుతూ 1982లో ప్రవేశపెట్టినటువంటి స్పెషల్ టీచర్స్ పద్ధతిని తొలగించుకోవడానికి 1996 వరకు పోరాటం చేయడం వల్ల 1996లో అప్రెంటిస్ రావడం జరిగింది…. ఈ అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేసుకోవడానికి 1996 నుండి 2011 వరకు నిరంతరం పోరాటం చేయడం వల్ల 2011 సెప్టెంబర్ 3, 4 ,5 తేదీలలో అప్పటి ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కత్తి నరసింహారెడ్డి గారు ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో,అనేక ఎస్టీయూ ఉద్యమాల ఫలితంగా 2012 డిఎస్సీలోనా అప్రెంటిస్ట్ రద్దు చేస్తూ ఎంపిక అయిన ఉపాధ్యాయులకు ఫుల్ స్కేల్ పే ఇస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది… కావున రాష్ట్ర ప్రభుత్వము పాలన విధానంలో రివర్స్ పాలనకు ఈ అప్రెంటిస్ విధాన ము పున ప్రవేశ పెట్టడం విడ్డూరంగా ఉంది..కావున అప్రెంటిస్ విధానాన్ని తీసుకు రావడాన్ని ఉపాధ్యాయులకు తీవ్ర నష్టమని దీన్ని వ్యతిరేకస్తున్నామని తెలిపారు…అలాగే డీఎస్సీ 20 వేలు పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఎస్టీయూ నాయకత్వం అప్రెంటిస్ విధానం రద్దు కొరకు ఎస్ టి యు పోరాటాలకు సిద్ధమవుతుందని తెలిపారు … ఈ సమావేశంలో ఎస్టీయూ నాయకులు గురురాజా,గంగ నాయక్,రాముడు,నాగేష్,అయ్యారాజు,శ్రీరాములు,పద్మావతమ్మ,ప్రమీలమ్మ తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!