చంద్రబాబుకు మతి భ్రమించింది
మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబుకు మతి భ్రమించి పసలేని ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్ పార్టీ కర్నూలు జిల్లా కార్యదర్శి వెల్లాల. మధుసూదనశర్మ తీవ్రంగా విమర్శించారు,నిన్న పత్తికొండలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా కార్యక్రమానికి సరైన స్పందన లేకపోవడముతో మతి భ్రమించి మా నాయకులు వై సాయిప్రసాద్ రెడ్డి గారి పైన, యువనేత జయమనోజ్ రెడ్డి గారిపైన ఆధారాలు లేని, ఆరోపణలు చేయడం చూస్తుంటే చంద్రబాబు ను చూసి జాలేస్తుందని మధుసూదనశర్మ అన్నారు. ఎందుకంటే తన కొడుకు లోకేష్ కంటే కూడా వయసులో చాలా చిన్నవాడైన జయమనోజ్ రెడ్డి పైన అనుచిత నిరాధార ఆరోపణలు చేయడం నిజంగా చంద్రబాబు స్థాయికి తగదని మధుసూదనశర్మ హితవు పలికారు. ఆదోని తెలుగుదేశం పార్టీలో నాయకత్వములేక పార్టీకి టికెట్ ఎవరికి వస్తుందో తెలియక అయోమయంలో ఉన్నారని ముందు ఆదోనిలో మీ పార్టీ పరిస్థితిని పరిశీలించుకోవాలని మధుసూదనశర్మ సూచించారు. ఆదోని నియోజకవర్గములో మా యువనేత జయమనోజ్ రెడ్డి గారికి ఉన్న ప్రజాబలం చూసి ఓర్వలేక ఆదోని టిడిపి నాయకులు ఏవో పిచ్ఛిరాతలు రాసిస్తే వాటిని తన స్థాయి మరచి బహిరంగ వేదికపై చదవడం చంద్రబాబు లాంటి నాయకుడికి తగదని మధుసూదనశర్మ సూచించారు. చంద్రబాబు లాంటి నాయకుడిని విమర్షించే స్థాయి నాది కాకపోయినా చిన్న పిల్లాడైన జయమనోజ్ రెడ్డి గారిపైన చంద్రబాబు చేసిన విమర్శలు చూసాక బాధగా అనిపించి సమాధానం చెప్పవలసి వచ్చిందని మధుసూదనశర్మ వివరించారు. ఆదోనిలో మళ్ళీ సాయిప్రసాద్ రెడ్డి గెలవబోతున్నారని మీడియా, సోషల్ మీడియా ద్వారా వచ్చే వార్తలను చూసి తట్టుకోలేక అలాగే ఆదోని లో ఇలాంటి పసలేని ఆరోపణలు ప్రజలు నమ్మడం లేదని గ్రహించిన టిడిపి నాయకులు పక్క నియోజకవర్గములో చంద్రబాబు తో ఇలాంటి ఆరోపణలు చేయించారని మధుసూదనశర్మ విశ్లేషించారు. కాబట్టి ఇకముందైన ఆదోని టిడిపి నాయకులు ఇలాంటి నిరాధార ఆరోపణలతో కూడిన స్క్రిప్ట్ రాసి ఇచ్ఛి, చదివించి ఆదోని పేరు ప్రతిష్ఠలు మంటగలపొద్ధని మధుసూదనశర్మ సూచించారు.
This post was created with our nice and easy submission form. Create your post!