in ,

ఘనంగా 93వ భగత్ సింగ్ వర్ధంతి. ~ ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్

* ఘనంగా 93వ భగత్ సింగ్  వర్ధంతి* *ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్*

*యువతకు ఆదర్శం భగత్ సింగ్*సిపిఐ సీనియర్ నాయకులు లక్ష్మిరెడ్డి*

ఆదోని న్యూస్ :- అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్, అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక AIYF కార్యాలయం నందు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్, ల 93వ వర్ధంతి కార్యక్రమం AIYF మండల అధ్యక్షులు:రమేష్ అధ్యక్షతన నిర్వహించి వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు, అనంతరం ఈ కార్యక్రమనికి సిపిఐ సీనియర్ నాయకులు :లక్ష్మీరెడ్డి, సిపిఐ పట్టణ కార్యదర్శి :సుదర్శన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి :యస్ షాబీర్ భాష, AIYF మండల కార్యదర్శి :అంజిత్ ముఖ్య అతిధులు పాల్గోని అనంతరం వారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు.విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే.భారత స్వాతంత్ర్యోద్యమం లో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో అతను ఒకడు. ఈ కారణంగానే షహీద్ భగత్ సింగ్ గా కొనియాడబడుతున్నాడు. భగత్ సింగ్ హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ పార్టీ స్థాపక సభ్యులలో ఒకడు. ఇప్పటి పాకిస్తాన్‌లో ఉన్న లాయల్ జిల్లా బంగా గ్రామంలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు భగత్ సింగ్ జన్మించాడు. భారత్‌లో బ్రిటీషు పాలన ను వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలను చేపట్టిన కుటుంబంలో అతను జన్మించాడు. యుక్త వయస్సులోనే ఐరోపా విప్లవ ఉద్యమాలను గురించి చదివిన సింగ్ అరాజకవాదం, సామ్యవాదమునకు ఆకర్షితుడయ్యాడు అనేక విప్లవాత్మక సంస్థల్లో అతను చేరాడు. హిందూస్తాన్ గణతంత్ర సంఘం (HRA)లో ఒక్కో మెట్టు ఎక్కుతూ అనతికాలంలోనే అందులోని నాయకుల్లో ఒకడుగా ఎదిగిన అతను, ఆ తర్వాత దానిని హిందూస్తాన్ సామ్యవాద గణతంత్ర సంఘం (HSRA)గా మార్చాడు. భారత, బ్రిటన్ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జైలులో 64 రోజుల నిరాహారదీక్షను చేపట్టడం ద్వారా సింగ్‌ విపరీతమైన మద్దతును కూడగట్టుకున్నాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజ్‌పత్ రాయ్ హత్య నేపథ్యంలో ఒక పోలీసు అధికారిని కాల్చినందుకు అతను ఉరితీశారు. అతను ఉత్తరదాయిత్వం భారత స్వాతంత్ర్య సిద్ధికి పోరాడేలా భారత యువతను ప్రేరేపించింది. అంతేకాక భారత్‌లో సామ్యవాద వ్యాప్తి మరింత పుంజుకుంది.భగత్ సింగ్ అరాజకవాదం, సామ్యవాదములకు ఆకర్షితుడయ్యాడు, సామ్యవాదం , పాశ్చాత్య అరాజకవాదాల ప్రభావం అతనుపై ఉంది. కార్ల్ మార్క్స్, ఫ్రెడ్రిచ్ ఏంజిల్స్, వ్లాదిమిర్ లెనిన్, లియాన్ ట్రాట్‌స్కై , మిఖాయిల్ బకునిన్‌ల ప్రవచనాలను అతను చదివేవాడు గాంధేయవాదంపై భగత్ సింగ్‌కు నమ్మకం లేదు. గాంధేయవాద రాజకీయాల వల్ల స్వార్థపరులు పుట్టుకొస్తూనే ఉంటారని అతను అభిప్రాయం. సింగ్ ఒక నాస్తికుడు.

ఐర్లాండ్ విప్లవకారుడు టెరెన్స్ మాక్‌స్వినే రచనలను కూడా భగత్ సింగ్ కొనియాడేవాడు. తన కుమారుడిని క్షమించమంటూ భగత్ సింగ్ తండ్రి బ్రిటీష్ ప్రభుత్వాన్ని అభ్యర్థించినప్పుడు, టెరెన్స్ మాక్‌స్వినే మాటలను సింగ్ ఉటంకించాడు. “నా విడుదల కన్నా నా మరణం బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కూలదోయగలదని నా విశ్వాసం” అని చెప్పి, అభ్యర్థనను ఉపసంహరించుకోవాలని తన తండ్రికి సూచించాడు. బ్లడ్ స్ప్రింక్లెడ్ ఆన్ ది డే ఆఫ్ హోలీ బాబర్ అకాలిస్ ఆన్ ది క్రుకిఫిక్స్” వంటి అతను రాసిన పలు రచనలు ధరమ్ సింగ్ హయత్‌పూర్‌‌ పోరాటం చేత ప్రభావితమయ్యాయి.

శాసనసభపై బాంబు విసిరేసిన సంఘటనకి కాస్త ముందుగా తన సహచరుడు సుఖ్‌దేవ్‌కు వ్రాసిన లేఖలో భగత్ సింగ్ “నాకూ ఆశలూ, ఆకాంక్షలూ ఉన్నాయి. ఆనందమైన జీవనం గడపాలని ఉంది. అయితే అవసరమొచ్చినప్పుడు వీటన్నిటినీ త్యజించగలను. ఇదే అసలైన బలిదానం భగత్ సింగ్ అరాజకవాదం(అనార్కిజం), సామ్యవాదం(కమ్యునిజం) అనే భావనలకు ఆకర్షితుడయ్యాడు. బకునిన్, మార్క్స్, లెనిన్ , ట్రాట్స్కిల రచనలంటే భగత్ కి చాలా ఇష్టం. సత్యాగ్రహాలను బోధించే గాంధేయవాదం మీద భగత్ కి నమ్మకం ఉండేదికాదు. గాంధేయవాదం దోపిడిదారుల్ని మారుస్తుందే కానీ, దోపిడీ నుంచి విముక్తి కల్పించదని భగత్ విశ్వసించేవాడు.అని వారు అన్నారు. మరియు కేంద్ర ప్రభుత్వం భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ ను ఆమాలు చేసి దేశంలో ఉన్న యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో రైతు సంఘాం సీనియర్ నాయకులు,:బాసాపురం గోపాల్, రైతు సంఘాం డివిజన్ అధ్యక్షులు నరసప్ప, కార్యదర్శి, యల్లప్ప, AISF నాయకులు :వీరేంద్ర, శివ, అల్లాబాకష్,వీరేష్,AIYF నాయకులు :లింగప్ప, గిరి,తదితరులు పాల్గొన్నారు

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

నేడు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల వర్ధంతి

వయసు చిన్నది..ఆలోచన పెద్దది