in ,

ఘనంగా హిందీ దినోత్సవ సంబరాలు

ఆదోని మండల పరిధిలోని పెద్ద తుంబలం గ్రామంలో గురువారం స్థానిక జడ్పీహెచ్ ఉన్నత పాఠశాల నందు ఘనంగా హిందీ దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా గత సంవత్సరం 10 వ తరగతిలో హిందీ లో 100 మార్కులకు 90 కి పైగా  ఉత్తమ మార్కులు సాధించిన 14 మంది విద్యార్థిని విద్యార్థులకు  హిందీ ఉపాధ్యాయురాలు డి నయిన  కుమారి మెమొంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బి వెంకటేశులు, డి నయిన కుమారి,నరసప్ప లు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి హిందీ చదవడం రాయడం నేర్చుకోవాలని వారు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలకు మాతృభాష తెలుగు అయినప్పటికీ మన దేశ భాష హిందీ కావున హిందీ లో ప్రతి విద్యార్థి ఉత్తమ మార్కులు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది కూడా పెద్ద తుంబలం జడ్పీహెచ్ ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సూర నారాయణ బసప్ప రమేష్ రామసుబ్బయ్య ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by G.Raju

స్వచ్చ సర్వేక్షన్ గ్రామీన్ 2023, రాష్ట్ర స్థాయి అవార్డుల ప్రదానోత్సవం

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి: