*కర్నూలు పశ్చిమ ప్రాంత సమస్యల పై ప్రత్యేక దృష్టి పెట్టండి లేకపోతే ఎడారిగా మారే అవకాశం ఉంది*
రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్ ఫెడరేషన్ (RPSF) ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్ సమస్యలతో కూడిన వినతిపత్రం ఆదోనిలో జరుగుతున్న స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారి సిబ్బందికి అందజేశారు. రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్ ఫెడరేషన్(RPSF) ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ కర్నూలు పశ్చిమ ప్రాంతం రాయలసీమలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతంలో అన్ని పార్టీలు పాలించిన ఇక్కడ జీవన పరిస్థితులు మారడం లేదు కావున ఇప్పటికైనా కర్నూలు పశ్చిమ ప్రాంతంపై దృష్టి సారించి ఇక్కడ ప్రభుత్వ విద్యాసంస్థలు,నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విధంగా కృషి చేయాలి అని ఇక్కడే వేదవతి, తుంగభద్ర,హంద్రీనీవా మరియు ఆర్డీఎస్ కుడి కాలువ చెంతనే పారుతున్న కూడా ఇక్కడి ప్రజలు వలస బాట పడుతున్నారు. అలాగే చదువుకోవాలని ఆసక్తి ఉన్న పేద విద్యార్థులు మధ్యలోనే విద్యాభ్యాసం వదిలేసి ప్రభుత్వ విద్యా అందక కూలీ పనులు చేస్తున్నారు అని అన్నారు.వెనుకబడిన రాయలసీమ సమాన అభివృద్ధిలో ఈ విద్యారంగం భాగస్వామ్యాన్ని సమగ్రంగా చర్చించి ఈ ప్రాంతంలో జరగాల్సిన అభివృద్ధి,రావాల్సిన వాటాలు, కోటాలు తెలుసుకోవడానికి వీలవుతుంది,ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యంత అవసరమైన విషయం అందుకే జిల్లా కలెక్టర్ గారు మరియు సిబ్బంది సమస్యలపై ప్రత్యేక దృష్టిని సారించాలి అని కోరారు. ఇన్ని రోజులు కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఉండే ప్రజలను కేవలం ఓట్లు యంత్రాలుగా మాత్రమే అన్ని పార్టీలు చూసాయి, ఇప్పటికైనా ఆకలి కేకలతో,వలసలతో అల్లాడుతున్న ఈ ప్రాంత విముక్తి కోసం కృషి చేయాలని మాట్లాడారు……. ఇప్పటికైనా ఈ ప్రాంతం పై దృష్టి పెట్టి మా సమస్యలైన ఆదోనిలోని ప్రభుత్వ హాస్టళ్లకు సొంత భవనాలకు కేటాయించాలి,ఆదోనిలోని పత్తి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి,రాయలసీమలో మైనింగ్ కళాశాలలో ఏర్పాటు చేయాలి మరియు కౌతళం మండలం మెలిగనూరు దగ్గర వరద కాలువ నిర్మించాలి, వేదవతి ప్రాజెక్టును మూడు నుండి 8 టీఎంసీలకు పెంచి, ప్రస్తుతం RDS కుడికాలువను నాలుగు టీఎంసీలతో నిర్మిస్తున్నారు కావున ఈ RDS కుడికాలువను ఎనిమిది టిఎంసి లతో నిర్మిస్తేనే సాగు తాగు నీరు అందుతాయి, పులికనుమ ప్రాజెక్టును 5 టీఎంసీల సామర్థ్యంతో పెంచాలి అని ముఖ్యమైన డిమాండ్లతో వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు విష్ణు, వీరేశ్, జయరాజ్, అశోక్, పవన్, రామలింగ, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!