in ,

ఎస్ ఎస్ ట్యాంక్ లో జాలరు చేతికి చిక్కిన ముసలి..

ఎస్ ఎస్ ట్యాంక్ లో ఉన్న ముసలి చిక్కింది

త్రాగు నీటి కోసం నిర్మించిన ఎస్ ఎస్ ట్యాంకులో కొన్ని నెలలుగా ముసలి సంచారం. పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. శుక్రవారం జాలరు చేతిలో చిక్కింన ముసలి..

కర్నూలు జిల్లా ఆదోని పట్టణ ప్రజల తాగునీటి అవసరాలకోసం శివార్లలో సమ్మర్ స్టోరేజ్ టాంక్ నిర్మించారు.. ఇక్కడ తుంగభద్ర దిగువ కాలువ నుంచి సమ్మర్ స్టోరేజ్ టాంక్ లోకి నీటి నింపి ఇక్కడి నుండే పట్టణ ప్రజా లకు తాగునీటిని సరఫరా చేస్తారు. గత ఏడాది క్రితం సమ్మర్ స్టోరేజ్ టాంక్ లో ముసలి సంచారిస్తుంది అని సిబ్బంది గ్రహించారు. విషయాని అదోని మునిసిపల్ కమిషనర్ రఘునాథ రెడ్డికి తెలిపారు. అప్పటి నుంచి పట్టుకోవటానికి చేసిన ప్రయత్నాలు పలించలేదు. శుక్రవారం రోజు జాలర్లు నీటిలోకి బొట్ ద్వారా దిగి ముసలి కోసము గాలించగా.. ముసలి వలలో పడింది. సిబ్బంది బటికి తీసుకువచ్చారు. ముసలి పట్టు బడటముతో సిబ్బంది, అధికారులు ఊపిరి పీల్చుకొ నారు. అనంతరం ఫారెస్ట్ అధికారులకు పిలిపించి ముసలిని ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. ఇంకా రెండు చిన్న ముసలి పిల్లలు ఉన్నాయని వాటిని కూడా త్వరలో పట్టుకుంటామని మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తెలిపారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

బ్రాహ్మణ సమస్యలు పరిష్కరించాలని సీఎంకు వినతి పత్రం అందజేత

జిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలి.