ఆదోని నియోజక వర్గంలోనీ ఎస్సీ హాస్టల్ లోని విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి అంటూ సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేత .~ ఆదోని టీఎన్ఎస్ఎఫ్
ఆదోని తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది,టీఎన్ఎస్ఎఫ్ నాయకులు సబ్ కలెక్టర్ గారికి విద్యార్థులు పడుతున్న బాధను వివరించారు.అనంతరం టీఎన్ఎస్ఎఫ్ కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి బోయ తేజ మాట్లాడుతూ రెండవ ముంబాయి అని పేరు గాంచిన ఆదోనిలో ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలం అయ్యారు పాలకులు అధికారులు కేవలం కుర్చీలకు పరిమితం అయ్యారన్నారు. రాష్ట్ర వ్యాప్త విద్యార్థులు ఈ వైకాపాపాలన లో చదువుకునే పరిస్థితి లేదు అనే మాట కు నిదర్శనం హాస్టల్ దుర్బర స్థితి అని అన్నారు,ఆదోని నియోజక వర్గ అద్యక్షులు బెస్త జయ సూర్య మాట్లాడుతూ రూమ్ములో లైట్ లు,ఫ్యాన్ లు పని చేయడం లేదని చీకటి లో దీపం పెట్టుకొని చదువుకునే స్థితికి దిగజార్చింది వైకాపా ప్రభుత్వం అని మండి పడ్డారు.ప్రధాన కార్యదర్శి బళ్లేకల్లు సూర్య మాట్లాడుతూ తాగే నీరు సంపు కు రంధ్రాలు పడి డ్రైనేజ్ నీరు కలుస్తున్నాయి ఈ నీళ్లు అధికార పాలకుల పిల్లలు తాగ గలరా అని మండిపడ్డారు,ఉపాధ్యక్షులు నూర, రమేష్, వికాస్, శశి మాట్లాడుతూ……… పై పెచ్చులు ఊడి పడుతున్నాయి వెంటనే నూతన భవనం మరియు టాయిలెట్స్ లేక ఆరు బయట వెళ్తున్న విద్యార్థులు పాములతో విష పురుగుల కాటులతో పోరాడుతూ ప్రతి రోజూ జీవనం సాగిస్తున్నారు,మెను ప్రకారంగా బోజనాలు లేవు ప్రభుత్వ సొమ్ము కు లూటీ చేస్తున్న వారిపై విచారణ చెప్పటి చర్యలు తీసుకోవాలని కోరారు లేని పక్షంలో రానున్న రోజుల్లో పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదోని నియోజక టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మంజు, సోము, చరణ్, ప్రదీప్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!